News June 2, 2024
ఈ విజయం చరిత్రాత్మకం: పెమా ఖాండు
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం చరిత్రాత్మకమని సీఎం పెమా ఖాండు అన్నారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ అందించిన సహకారానికి ప్రజలు తిరిగి చెల్లించారని చెప్పారు. బీజేపీకి మరో ఐదేళ్లు అధికారం కట్టబెట్టారని పేర్కొన్నారు. జూన్ 4న వెలువడే లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో దేశం మొత్తం ఇదే జోరు విస్తరిస్తుందని పేర్కొన్నారు.
Similar News
News January 8, 2025
ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు ఉండవా?
AP: ఇంటర్మీడియట్‌లో కీలక సంస్కరణలు రానున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు లేకుండా CBSE తరహాలో కోర్సులో ఒకేసారి సెకండియర్‌లో ఎగ్జామ్స్ పెట్టాలని విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీంతో చదువుకునేందుకు ఎక్కువ సమయం లభించి ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని భావిస్తోంది. మొదటి ఏడాది అంతర్గత మార్కుల విధానం తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే ముందుకెళ్లనుంది.
News January 8, 2025
మరో అమ్మాయితో చాహల్ (PHOTO)
ధనశ్రీతో విడాకుల వార్తల నేపథ్యంలో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మరో అమ్మాయితో కెమెరాకు చిక్కారు. ముంబైలోని ఓ హోటల్ నుంచి బయటకు వచ్చే సమయంలో చాహల్ తన ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని కనిపించారు. ఆ యువతి పేరు తనిష్క కపూర్ అని, కన్నడలో రెండు సినిమాల్లో నటించినట్లు వార్తలు వస్తున్నాయి. ధనశ్రీతో పరిచయం కాకముందు వీరిద్దరూ డేటింగ్ చేసినట్లు సమాచారం. అప్పట్లో చాహల్ ఈ వార్తలను కొట్టిపారేశారు.
News January 8, 2025
సర్టిఫికెట్లు ఆపితే విద్యాసంస్థల అఫిలియేషన్ రద్దు!
AP: అడ్మిషన్ల వేళ ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకోవడం, ఫీజు కట్టలేదని సర్టిఫికెట్లు ఆపుతున్నట్లు ఫిర్యాదులు రావడంపై కాలేజీలపై ప్రభుత్వం సీరియస్ అయింది. అదనపు ఫీజుల వసూలు, రీయింబర్స్‌మెంట్ వర్తించే వారినీ ఫీజు కట్టాలని ఒత్తిడి చేసే విద్యాసంస్థల అఫిలియేషన్ రద్దు చేయాలని నిర్ణయించింది. అడ్మిషన్ తీసుకున్న తర్వాత వద్దనుకుంటే 5% మినహాయించి 15 రోజుల్లో కట్టిన ఫీజు వెనక్కి చెల్లించాలని ఆదేశించింది.