News June 2, 2024
ఆసిఫాబాద్: భారీ వర్షం.. కొట్టుకుపోయిన తాత్కలిక వంతెన

ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామం వాగుపై రాకపోకలు కొనసాగించేందుకు గుండి గ్రామస్థులు తాత్కాలిక వంతెన నిర్మించుకున్నారు .గుండి తాత్కాలిక వంతెన ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీనితో గుండి గ్రామస్తులకు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా ఆసిఫాబాద్ జిల్లా అధికారులు స్పందించి వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు కోరారు.
Similar News
News November 1, 2025
ADB: స్వయం ఉపాధి దిశగా యువత ముందుకు రావాలి: కలెక్టర్

ప్రభుత్వం అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి అవకాశాలను యువత పూర్తిగా వినియోగించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. శనివారం ఆదిలాబాద్‌లోని టీటీడీసీ భవనంలో నిర్వహించిన ఇందిరమ్మ సెంట్రింగ్ యూనిట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.
News November 1, 2025
భీంపూర్‌లో పులి సంచారం

భీంపూర్ మండలంలో పులి సంచారం రైతులకు కునుకు లేకుండా చేస్తుంది. శనివారం ఉదయం పిప్పల్ కోటి, గూడ గ్రామాల శివారులోని యాల్ల కేశవ్, పొగుల రమేశ్ పంట పొలాల్లో పులి కనిపించింది. గమనించిన కూలీలు భయంతో ఇంటికి వెళ్లిపోయినట్లు గ్రామస్థలుు తెలిపారు. కాగా ప్రస్తుతం పులి గర్భం దాల్చినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు.
News November 1, 2025
ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన విద్య అందించాలి

ప్రభుత్వ విద్యా సంస్థల్లో పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణి ఆదేశించారు. శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాజార్షి షా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, విద్యాశాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. నాణ్యమైన బోధన, మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు.


