News June 2, 2024
39 ఏళ్లలో తొలిసారి ఓడిన మాజీ సీఎం

సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష SDF పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఒక్క సీటుకే పరిమితమైన ఈ పార్టీ 2019తో పోలిస్తే 14 సీట్లను కోల్పోయింది. తాజా ఫలితాల్లో ఆ పార్టీ చీఫ్, మాజీ CM పవన్ కుమార్ చామ్లింగ్ 39 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా ఓడారు. ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోవడం గమనార్హం. 1985 నుంచి వరుసగా 8 సార్లు ఆయన MLAగా గెలుపొందారు. 1994-2019 వరకు సిక్కిం సీఎంగా పవన్ కుమార్ పనిచేశారు.
Similar News
News November 6, 2025
పిల్లల్లో ఈటింగ్ డిజార్డర్

కొందరు పిల్లలు ఎంత తింటున్నారో తెలియకుండా తినేస్తుంటారు. దీన్నే ఈటింగ్ డిజార్డర్ అంటారు. దీనివల్ల పిల్లల్లో జుట్టు రాలడం, అతిగా కోపాన్ని ప్రదర్శించడం, నలుగురితో కలవకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల ఆహారపు అలవాట్లను క్రమబద్ధం చేయడానికి కుటుంబం వారికి అండగా నిలవాలి. భయపెట్టడం, అలవాట్లను బలవంతంగా మార్చడానికి ప్రయత్నించకూడదు. మార్పు వచ్చే వరకు సహనంగా, మృదువుగా ప్రవర్తించాలి.
News November 6, 2025
ఏకగ్రీవ ఎన్నిక ఓటుస్వేచ్ఛను దెబ్బతీయడం కాదు: కేంద్రం, ఈసీ

ఓటు స్వేచ్ఛ ఓటు హక్కుకు భిన్నమైనదని కేంద్రం, ECలు సుప్రీంకోర్టుకు నివేదించాయి. ఒక్క అభ్యర్థే ఉన్నప్పుడు ఏకగ్రీవ ఫలితం ప్రకటించడమంటే ‘నోటా’ అవకాశాన్ని కాదనడమేనన్న పిటిషన్‌పై అవి సమాధానమిచ్చాయి. ‘ఓటుహక్కు చట్టబద్ధం. ఓటుస్వేచ్ఛ రాజ్యాంగ హక్కు. పోలింగ్ జరిగినప్పుడే ఓటు స్వేచ్ఛ వర్తిస్తుంది’ అని పేర్కొన్నాయి. పోలింగే లేనప్పుడు రాజ్యాంగహక్కును దెబ్బతీసినట్లు కాదని తెలిపాయి. దీనిపై SC విచారణ చేపట్టింది.
News November 6, 2025
KGF నటుడు కన్నుమూత

కేజీఎఫ్ నటుడు <<17572420>>హరీశ్ రాయ్<<>> కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. KGF-1లో హరీశ్ రాయ్.. ఛాఛా అనే పాత్రలో నటించారు. రెండో పార్ట్ రిలీజైన నాటికే ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అది నాలుగో స్టేజీకి చేరడంతో పూర్తిగా బక్కచిక్కిపోయారు. ఆర్థిక సాయం చేయాలని కోరగా నటుడు ధ్రువ్ సర్జా హెల్ప్ చేశారు. పరిస్థితి చేజారిపోవడంతో ఆయన మరణించారు.


