News June 3, 2024
T20WC: పపువా న్యూగినియాపై విండీస్ విజయం

టీ20 ప్రపంచకప్‌లో పపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్ట్ ఇండీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్ ప్రత్యర్థిని 136 పరుగులకు కట్టడి చేసింది. అయితే లక్ష్యాన్ని ఛేదించడంలో విండీస్ ఆటగాళ్లు చెమటోడ్చారు. సునాయాసంగా గెలుస్తారని అనుకున్న మ్యాచ్ 19వ ఓవర్ వరకు కొనసాగింది. బ్రాండన్ కింగ్ 34(29), ఛేస్ 42*(27) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
Similar News
News November 3, 2025
మెగ్నీషియంతో జుట్టుకు మేలు

వయసుతో సంబంధం లేకుండా అందర్నీ వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. దీనికోసం పైపైన ఎన్ని షాంపూలు, నూనెలు వాడినా ఉపయోగం ఉండదంటున్నారు నిపుణులు. మెగ్నీషియం లోపం వల్ల మాడుకు రక్త ప్రసరణ తగ్గడంతో పోషకాలు అందక జుట్టు సమస్యలు వస్తాయి. పాలకూర, గుమ్మడి గింజలు, బాదం, అవిసెగింజలు, చియా, బీన్స్, చిక్కుళ్లు, అరటి, జామ, కివీ, బొప్పాయి, ఖర్జూరాలు, అవకాడో వంటివి ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
News November 3, 2025
బస్సు ప్రమాదంపై మోదీ విచారం.. పరిహారం ప్రకటన

TG: మీర్జాగూడ <<18184089>>ప్రమాదంపై<<>> ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
News November 3, 2025
బస్సు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

మీర్జాగూడ <<18183773>>బస్సు<<>> ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ప్రయాణికుల మృతి తీవ్రంగా కలచివేసిందని చంద్రబాబు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు పవన్ సైతం సానుభూతి ప్రకటించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.


