News June 3, 2024

జూన్ 3: చరిత్రలో ఈరోజు

image

1924: తమిళనాడు సీఎం కరుణానిధి జననం
1930: మాజీ రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ జననం
1943: మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా జననం
1952: రచయిత బండి నారాయణస్వామి జననం
1965: నటి రాధ జననం
1972: BRS నేత హరీశ్ రావు జననం
2016: బాక్సింగ్ ఛాంపియన్ మొహమ్మద్ అలీ మరణం
>> ప్రపంచ సైకిల్ దినోత్సవం

Similar News

News October 11, 2024

‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ REVIEW

image

ఇది కన్నతండ్రి(సాయిచంద్), పెంచిన తండ్రి(సాయాజీ షిండే), ఓ కొడుకు(సుధీర్‌బాబు) మధ్య ముక్కోణపు ఎమోషనల్ కథ. డైరెక్టర్ అభిలాష్ కొత్త తరహా కథాంశాన్ని ఎమోషనల్ డ్రామాగా తీర్చిదిద్దారు. పెంచిన తండ్రి అప్పు తీర్చేందుకు హీరో కష్టాలు, కొడుకు ప్రేమకై తపించే కన్నతండ్రి యాంగిల్ ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సన్నివేశాలు బాగున్నా పాత్రల మధ్య కొరవడిన భావోద్వేగాలు, స్లో నరేషన్, చివరి 20 నిమిషాలు మైనస్.
రేటింగ్: 2.5/5

News October 11, 2024

16 నుంచి ఇంటర్ కాలేజీల టైమింగ్స్ మార్పు

image

AP: ప్రభుత్వ జూనియర్, ఎయిడెడ్ కాలేజీల సమయాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం ఉ.9 నుంచి సా.4 వరకు టైమింగ్స్ ఉండగా, ఈ నెల 16 నుంచి సా.5 వరకు సమయాన్ని పొడిగించింది. గత ఏడాది ఫలితాల్లో ఆశించిన స్థాయిలో విద్యార్థులు రాణించకపోవడంతో సా.4-5 గంటల మధ్య స్టడీ అవర్ నిర్వహించాలని ఇంటర్ బోర్డు డైరెక్టర్ కృతిక శుక్ల ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోవాలని ప్రిన్సిపల్స్‌ను ఆదేశించారు.

News October 11, 2024

OTTలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ

image

శ్రీసింహా, సత్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మత్తు వదలరా-2’ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రితీశ్ రాణా దర్శకత్వం వహించిన ఈ మూవీ గత నెల 13న విడుదలైన సూపర్ హిట్‌గా నిలిచింది. కాలభైరవ సంగీతం అందించగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించారు. వెన్నెల కిశోర్, సునీల్, రోహిణి, ఝాన్సీ కీలక పాత్రలు పోషించారు.