News June 3, 2024
93ఏళ్ల వయసులో ఐదో పెళ్లి!

మీడియా దిగ్గజం రూపర్ట్ మర్దోక్ (93) ఐదోసారి వివాహం చేసుకున్నారు. USలో తన కంటే 25ఏళ్లు చిన్న అయిన మాజీ శాస్త్రవేత్త ఎలీనా జుకోవాను పెళ్లాడారు. మర్దోక్‌కు మొదట పాట్రీషియా బుకర్‌తో పెళ్లి కాగా 1960ల్లో విడిపోయారు. ఆ తర్వాత మరియామన్, విన్‌డీ డెంగ్, జెర్రీ హాల్‌లనూ వివాహం చేసుకుని పలు కారణాలతో విడాకులు తీసుకున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్, ఫాక్స్ న్యూస్ తదితర సంస్థలను మర్దోక్ గ్రూప్ నిర్వహిస్తోంది.
Similar News
News February 2, 2026
కుసుమలో పేనుబంక, శనగపచ్చ పురుగు నివారణ

రబీ సీజన్‌లో సాగు చేస్తున్న కుసుమ పంట పూత దశలో పేనుబంక తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2ML లేదా ఎసిఫేట్ 1.5గ్రాములను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కుసుమను శనగపచ్చ పురుగు ఆశిస్తే దీని నివారణకు లీటరు నీటిలో క్లోరోపైరిఫాస్ 25 ఇసి 2.5ML లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.
News February 2, 2026
ఆడపిల్లలు గడపపై కూర్చుకూడదా?

ఇంటి ప్రధాన ద్వారం గడపను లక్ష్మీదేవి నివాసస్థానంగా భావిస్తారు. అందుకే గడపపై ఆడపిల్లలు కూర్చోవడం లక్ష్మీదేవిని అగౌరవ పరిచినట్లవుతుందని పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించి, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, కుటుంబ కలహాలు తలెత్తే అవకాశం ఉంది. గడపపై కాలు పెట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఇల్లు వీడుతుందని నమ్మకం. ఇంటి పురోగతిని కోరేవారు ఇలాంటి పనులు చేయకూడదు.
News February 2, 2026
364 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(UCIL) 364 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ, బీటెక్, డిగ్రీ(BA,BCom,BBA,LLB), డిప్లొమా, ఐటీఐ అర్హత గల వారు ఫిబ్రవరి 28 వరకు NATS/NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.uraniumcorp.in


