News June 3, 2024

MDK: నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ

image

నేటి నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లి మెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. జిల్లాలో 783 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మెదక్ లోని ప్రభుత్వ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. హాల్ టికెట్లను www.bse.telanganaa.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.

Similar News

News February 28, 2026

మెదక్: ఉమ్మడి జిల్లాలో ముగ్గురు కలెక్టర్లు మహిళలే!

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో పాలనాధికారులు (కలెక్టర్లు) ముగ్గురూ మహిళలే కావడం విశేషం. ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి కలెక్టర్‌గా ప్రావీణ్య, సిద్దిపేట కలెక్టర్‌గా హైమావతి ఉండగా తాజాగా జరిగిన కలెక్టర్ల బదిలీలో మెదక్ కలెక్టర్ గా ప్రతిమా సింగ్ నియమితులయ్యారు. దీంతో ఉమ్మడి జిల్లా పరిపాలనలో మహిళల చేతిలో ఉంది. 2016లో ఉమ్మడి జిల్లాను మూడు జిల్లాలు (మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట)గా విభజించిన విషయం తెలిసిందే.

News February 28, 2026

మెదక్: 9 నెలలు.. రూ.4,611 కోట్ల రుణాలు

image

మెదక్ జిల్లాలో గత 9 నెలల్లో వివిధ రంగాలకు రూ.4,611 కోట్ల రుణాలను పంపిణీ చేసి, వార్షిక లక్ష్యంలో 67.32 శాతం పూర్తి చేశామని అడిషనల్ కలెక్టర్ నగేష్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో మాట్లాడారు. రైతులకు, మహిళా సంఘాలకు రుణాల పంపిణీలో పెద్దపీట వేశామన్నారు. బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న రుణ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News February 28, 2026

మెదక్: మాజీ కలెక్టర్ రాహుల్ రాజ్‌కు ఘనంగా వీడ్కోలు

image

రెండేళ్ల పాటు మెదక్ కలెక్టర్‌గా పనిచేసి సహకార శాఖ ప్రత్యేక కమిషనర్‌గా బదిలీ అయిన రాహుల్ రాజ్‌కు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. వినూత్న పద్ధతులు, విప్లవాత్మక నిర్ణయాలతో మెదక్ జిల్లాను రాహుల్ రాజ్ రోల్ మోడల్‌గా నిలిపారని కొనియాడారు. పాలనలో ఆయన తనదైన ముద్ర వేశారని అధికారులు గుర్తు చేసుకున్నారు.