News June 3, 2024

ఇబ్బంది కలిగిస్తే బయటకు పంపండి: ముకేశ్ కుమార్ మీనా

image

APలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా కలెక్టర్లను ఆదేశించారు. రేపు కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంతరాలు కలిగించేందుకు ప్రయత్నించే వారిని వెంటనే బయటకు పంపించేయాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ప్రతి ఈవీఎంకు సీల్ వేసి భద్రపరచాలని వివరించారు.

Similar News

News October 11, 2024

నేడు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన చేయనున్న సీఎం

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకురానుంది. దీనిలో భాగంగా ఇవాళ 28 స్కూళ్లకు ఒకేసారి శంకుస్థాపన జరగనుంది. రంగారెడ్డిలోని షాద్‌నగర్ వద్ద సీఎం రేవంత్, మధిరలో డిప్యూటీ సీఎం ఈ కాంప్లెక్సులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5వేల కోట్లు కేటాయించగా ఒక్కో స్కూల్ నిర్మాణానికి రూ.26 కోట్లు వెచ్చించనుంది.

News October 11, 2024

స్విగ్గీ బాయ్‌కాట్ నిర్ణయం వెనక్కి

image

AP: ఈ నెల 14 నుంచి స్విగ్గీ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ <<14272365>>బాయ్‌కాట్<<>> చేయాలన్న నిర్ణయాన్ని హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ వెనక్కి తీసుకుంది. స్విగ్గీ యాజమాన్యంతో చర్చలు సానుకూలంగా జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నవంబర్ 1 నుంచి స్విగ్గీతో ఒప్పందాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.

News October 11, 2024

ఎన్‌కౌంటర్ మృతులు 34: బస్తర్ ఐజీ

image

ఈ నెల 5న ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారి సంఖ్య 34 అని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. తాము 31 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మిగిలిన 3 మృతదేహాలను మావోయిస్టులు అడవిలోనే ఖననం చేసినట్లు పేర్కొన్నారు.