News June 3, 2024

BREAKING: చిట్యాల వద్ద యాక్సిడెంట్

image

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేటు బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతోంది.

Similar News

News January 15, 2026

NLG: జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ అంతంతే!

image

వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో కేంద్రం చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఓ పక్క సర్వర్ మొరాయింపు.. ఇంకోపక్క వ్యవసాయ పనుల్లో రైతుల నిమగ్నం.. మరోవైపు అవగాహన లేమి.. వెరసి పంటల ఆన్లైన్ నమోదుకు అడ్డంకిగా మారాయి. జిల్లాలో 5,65,782 మంది రైతులకు గాను ఇప్పటివరకు 30,953 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 3,34,953 మంది రైతులు రిజిస్ట్రేషన్‌కు దూరంగా ఉన్నారు.

News January 14, 2026

నల్గొండ జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

నల్గొండ ఇక కార్పొరేషన్… గెజిట్ విడుదల
మాడుగులపల్లి: చైనా మాంజా నుంచి సేఫ్.. ఐడియా అదిరింది
నల్గొండ: పుర పోరు.. రిజర్వేషన్లపై ఉత్కంఠ
నల్గొండ: భోగి మంటల్లో జీవో ప్రతులు దగ్ధం
కట్టంగూరు: పాలకవర్గాలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక
నల్గొండ: రైస్ మిల్లులు.. అక్రమాలకు నిలయాలు
మిర్యాలగూడ: జిల్లా డిమాండ్.. మళ్లీ తెరపైకి
కట్టంగూరు: ఘనంగా గోదారంగనాథ స్వామి కళ్యాణం
దేవరకొండలో ఆర్టీసీ కార్మికుల నిరసన

News January 14, 2026

NLG: లండన్ వేదికగా చేనేత కళా వైభవం

image

చండూరుకు చెందిన చేనేత కళాకారుడు చిలుకూరి శ్రీనివాస్ అంతర్జాతీయ వేదికపై భారతీయ చేనేత నైపుణ్యాన్ని చాటనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు లండన్‌లో జరిగే ‘స్ప్రింగ్ ఫెయిర్’ వర్తక ప్రదర్శనలో చేనేత లైవ్ డెమో ఇచ్చేందుకు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల 29న ఆయన లండన్ బయలుదేరనున్నారు. తన ఎంపికకు సహకరించిన కేంద్ర చేనేత సేవా కేంద్రం డైరెక్టర్ అరుణ్‌కు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.