News June 3, 2024
విశాఖ: 645 మంది పోలీసులు, 176 సీసీ కెమెరాలు
మంగళవారం జరగనున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ప్రతి అణువు పర్యవేక్షించే విధంగా 176 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు 84 మంది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, 60 మంది ఏపీ ఎస్పీ పోలీసులు, 9 యాక్సెస్ కంట్రోల్ పాయింట్లను ఏర్పాటు చేశారు. భద్రత కోసం 501 మంది సివిల్ పోలీస్ ఫోర్స్ సైతం వినియోగిస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించే విధంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేశారు.
Similar News
News January 14, 2025
మధురవాడ: రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
మధురవాడ జాతీయ రహదారిపై ఆనందపురం వెళుతున్న ఓ బైక్‌పై లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో కారు ఢీకొనడంతో వెనుక కూర్చున్న మహిళ కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పీఎం పాలెం ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కార్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పీఎం పాలెం ట్రాఫిక్ సీఐ సునీల్ దర్యాప్తు చేపట్టారు.
News January 14, 2025
విశాఖ నుంచి 300 బస్సులను నడిపిన ఆర్టీసీ
సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం సోమవారం 300 స్పెషల్ బస్సులను నడిపినట్లు ఆర్టీసీ విశాఖ ప్రాంతీయ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, టెక్కలి, పలాస రూట్లలో ప్రయాణికులను ఎప్పటికప్పుడు బస్సుల్లో పంపించినట్లు పేర్కొన్నారు. ద్వారక ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్‌లో దుకాణాలను తనిఖీ చేసి, ఎంఆర్పీ రేట్లకే వస్తువులను విక్రయించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు.
News January 14, 2025
విశాఖ – చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు విశాఖ నుంచి చర్లపల్లికి (08523/24)ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ కుమార్ తెలిపారు. నేడు సాయంత్రం విశాఖలో 6:20కు బయలుదేరుతుంది. దువ్వాడ, రాజమండ్రి, భీమవరం, గుడివాడ మీదుగా మరుసటి రోజు తెల్లవారి 7:30కి చర్లపల్లి చేరుతుంది. 2nd AC,3rd Ac, స్లీపర్, జనరల్ క్లాస్ ఉంటాయన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.