News June 3, 2024
నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు: చిన్నారెడ్డి

నకిలీ విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని సోమవారం చిన్నారెడ్డి అన్నారు. నాణ్యత కలిగిన విత్తనాలనే రైతులు కొనాలని సూచించారు. రైతులు విత్తనాలు కొన్నప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే స్థానిక వ్యవసాయ అధికారులకు గాని, పోలీసులకు గాని సమాచారం చేరవేయాలి అన్నారు. వారిపై చట్టప్రకారం తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News January 23, 2026
గంగాపురం జాతరకు ప్రత్యేక బస్సులు

గంగాపురంలో కొలువైన లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ సంతోశ్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వారికి సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా టెంట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
News January 23, 2026
MBNR: ఎంవీఎస్ కళాశాలలో రేపు జాతీయ స్థాయి సెమినార్

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జాతీయ స్థాయి బహుశాఖ సెమినార్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా. కె.పద్మావతి తెలిపారు. విద్యా, వైద్య, పరిశోధన రంగాల్లోని నూతన ఆవిష్కరణలపై ఈ సదస్సు జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా టీజీసీహెచ్‌ఈ ఛైర్మన్ ప్రొ. వి.బాలకృష్ణారెడ్డి, గౌరవ అతిథిగా పాలమూరు వర్సిటీ వీసీ ప్రొ. జి.ఎన్.శ్రీనివాస్ హాజరుకానున్నారు.
News January 23, 2026
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 11 మంది సీఐల బదిలీ

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో పని చేస్తున్న 11 మంది సీఐలను బదిలీ చేస్తూ మల్టీ జోన్-2 అదనపు డీజీపీ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జిల్లా ట్రాఫిక్ సీఐగా ఉన్న భగవంత రెడ్డిని మరికల్‌కు బదిలీ చేశారు. బదిలీ అయిన వారు తక్షణమే తమ కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు.


