News June 3, 2024

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన.. బీఆర్ఎస్ MLAపై కేసు

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. గతేడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆయన పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువాతో వెళ్లారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ ఓటర్లను మభ్యపెట్టిన ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. 188 ఐపీసీ, 130 ఆర్పీ సెక్షన్ల కింద కేసు నమోదైంది.

Similar News

News November 11, 2025

డేవిడ్ సలయ్‌కి ‘బుకర్ ప్రైజ్’

image

కెనడియన్-హంగేరియన్ రచయిత డేవిడ్ సలయ్‌ను ఈ ఏడాది ‘బుకర్ ప్రైజ్’ వరించింది. సాధారణ మనిషి జీవితం ఆధారంగా ఆయన రాసిన ‘ఫ్లెష్’ నావెల్‌కిగానూ ఈ పురస్కారం దక్కింది. 51 ఏళ్ల డేవిడ్ ఫైనల్లో ఐదుగురు రచయితలను వెనక్కినెట్టారు. వీరిలో ఇండియన్ మహిళా రచయిత కిరణ్ దేశాయ్ కూడా ఉన్నారు. ఆమె రాసిన ‘లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’ పుస్తకం బుకర్ దక్కించుకోలేకపోయింది.

News November 11, 2025

మనీ ప్లాంట్ త్వరగా పెరగాలంటే?

image

* మనీ ప్లాంట్ పెంచే నీళ్లలో కొద్దిగా శీతల పానీయాలు పోస్తే ప్లాంట్ త్వరగా పెరుగుతుంది.
* వంటింట్లో నాలుగు మూలలు బోరిక్ యాసిడ్ పౌడర్‌ చల్లితే దోమల బెడద తగ్గుతుంది.
* కళ్లజోడు అద్దాలకు టూత్ పేస్ట్ రాసి టిష్యూ పేపర్‌తో శుభ్రం చేస్తే జిడ్డు పోతుంది.
* అన్నం మెతుకులు విడివిడిగా రావాలంటే ఉడికేటప్పుడు టేబుల్ స్పూన్ కనోలా ఆయిల్ వేయాలి.
* చపాతీలను బియ్యప్పిండితో వత్తితే మృదువుగా వస్తాయి.

News November 11, 2025

పుట్టగొడుగులు, కూరగాయలతో ఏటా రూ.7.50 కోట్ల వ్యాపారం

image

కూరగాయలు, ఆర్గానిక్ విధానంలో పుట్టగొడుగుల పెంపకంతో నెలకు రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్నారు ఆగ్రాకు చెందిన అన్నదమ్ములు ఆయుష్, రిషబ్ గుప్తా. వీరు ఆగ్రాలో 2021లో కూరగాయల సాగు, 2022లో పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించారు. నేడు నెలకు 40 టన్నుల పుట్టగొడుగులు, 45 టన్నుల కూరగాయలను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. వీరి వార్షిక టర్నోవర్ రూ.7.5 కోట్లు. ✍️ మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.