News June 3, 2024
HYD: మాధవి హత్య.. పోలీసుల దర్యాప్తు

HYD మల్కాజిగిరిలోని నేరేడ్‌మెట్ పీఎస్ పరిధి బలరాంనగర్‌లో ఈరోజు <<13367811>>మాధవి(34) అనే మహిళ<<>> హత్యకు గురైన విషయం తెలిసిందే. పిల్లలతో కలిసి అద్దె గదిలో ఉంటున్న ఆమెను ఎవరు చంపి ఉంటారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగిందా లేదా దోపిడీ దొంగలు ఎవరైనా ఇంట్లోకి చొరబడి ఆమెను చంపేశారా అనే కోణంలో క్లూస్ టీం సాయంతో దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 18, 2026
మునిసిపల్ ఎన్నికలు.. అభ్యర్థులారా ఇవి తెలుసుకోండి

2026 మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు అర్హతలు, నామినేషన్ నిబంధనలు, ఖర్చు పరిమితులు తప్పక తెలుసుకోవాలి. భారత పౌరుడై 21 ఏళ్లు నిండాలి. సంబంధిత వార్డు ఓటరై ఉండాలి. పార్టీ అభ్యర్థికి ఒక ప్రపోజర్, స్వతంత్ర అభ్యర్థికి 10 మంది ప్రపోజర్లు అవసరం. ఖర్చు పరిమితి మునిసిపాలిటీ రకాన్ని బట్టి రూ.2-రూ.10లక్షల వరకుంటుంది. ప్రతి ఖర్చు రిజిస్టర్‌లో నమోదు చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నిక రద్దవుతుంది.
News January 18, 2026
రంగారెడ్డి: జనవరి 19 నుంచి సర్పంచులకుTRAINING

రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఐదు విడతల్లో శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ముచ్చింతల స్వర్ణ భారతి ట్రస్టులో జనవరి 19 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఈ తరగతులు జరగనున్నాయి. ఫరూక్ నగర్, కొందుర్గు తదితర మండలాల్లో ఫిబ్రవరి 17 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. పాలనాపరమైన అంశాలపై అవగాహన కల్పించే ఈ శిక్షణకు ప్రతిఒక్క సర్పంచ్ హాజరుకావాలని అధికారులు ఆదేశించారు.
News January 18, 2026
రంగారెడ్డి జిల్లాలో మహిళలకు 62 స్థానాలు

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులు ఉన్నాయి. వీటిలో ఆమనగల్లులో 15, చేవెళ్లలో 18, ఇబ్రహీంపట్నంలో 24, మొయినాబాద్‌లో 26, షాద్‌నగర్‌లో 28, శంకర్‌పల్లిలో 15 వార్డులు ఉన్నాయి. వీటిలో ST మహిళ, SC మహిళ, BC మహిళ, అన్‌రిజర్వ్‌డ్ మహిళలకు 62 స్థానాలు దక్కాయి. ఆమనగల్లులో 7, చేవెళ్లలో 9, ఇబ్రహీంపట్నంలో 12, మొయినాబాద్‌లో 13, షాద్‌నగర్‌లో 14, శంకర్‌పల్లిలో 7వార్డులు మహిళలకు కేటాయించారు.


