News June 3, 2024

టీ20 వరల్డ్ కప్‌లో నందిని, అమూల్ బ్రాండ్లు

image

దేశంలోని ప్రముఖ మిల్క్ డెయిరీ సంస్థలు అమూల్, నందిని టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే జట్లకు స్పాన్సర్లుగా మారాయి. నందిని ఐర్లాండ్ టీమ్‌కు, అమూల్ అమెరికాకు స్పాన్సర్ చేస్తున్నాయి. దీంతో వాటి లోగోలున్న జెర్సీలను ఆయా జట్ల సభ్యులు ధరించి మ్యాచ్‌ల్లో పాల్గొంటున్నారు. ఇది మన దేశంలో పాల ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు విక్రయాల పెరుగుదలకు తోడ్పడనుందని అమూల్, నందిని సంస్థలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Similar News

News October 10, 2024

ఎంత మంచి మనసయ్యా నీది!

image

రతన్ టాటా తన ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచేవారు. తన ఉద్యోగి ఒకరు అనారోగ్యం పాలయ్యాడని తెలుసుకుని 83 ఏళ్ల వయసులో పుణే వెళ్లి పరామర్శించారు. మీడియాకు తెలియకుండా ఆ ఫ్యామిలీకి ఆర్థికసాయం చేశారు. 26/11 ముంబై ఉగ్ర దాడుల్లో ప్రభావితమైన 80 మంది తాజ్ హోటల్ ఉద్యోగులకు ఆర్థికసాయం చేయడంతో పాటు వారి పిల్లల చదువు బాధ్యతలను తీసుకున్నారు. కరోనా సంక్షోభంలోనూ టాటా గ్రూప్ నుంచి ఒక్క ఉద్యోగినీ తొలగించలేదు.

News October 10, 2024

బరి తెగించిన టీడీపీ ఎమ్మెల్యేలు: VSR

image

AP: మద్యం షాపుల దరఖాస్తుల్లో టీడీపీ ఎమ్మెల్యేలు సిండికేట్‌గా మారి సర్కార్ ఖజానాకు గండి కొడుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ‘కమీషన్లు, దందాలతో ఎమ్మెల్యేలు బరి తెగిస్తున్నారు. వాళ్ల అవినీతి పరాకాష్ఠకు చేరింది. 4 నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. MLAలపై వస్తున్న ఆరోపణలపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. లేదంటే శ్వేతపత్రం సమర్పించి విచారణకు ఆదేశించాలి’ అని డిమాండ్ చేశారు.

News October 10, 2024

పాక్‌తో టెస్టు.. చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్

image

పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. 150 ఓవర్లలోనే 823/7(D) స్కోర్ చేసి పలు రికార్డులు సొంతం చేసుకుంది. 800పైన స్కోర్ 3 సార్లు చేసిన తొలి జట్టు, 5.48 రన్‌రేట్‌తో 700పైన రన్స్ చేసిన మొదటి టీమ్‌గా ENG నిలిచింది. అలాగే టెస్టు క్రికెట్‌లో ఇది నాలుగో అత్యధిక స్కోర్. తొలి స్థానంలో శ్రీలంక 952/5d(vsIND) ఉండగా, ఆ తర్వాత ఇంగ్లండ్ 903/7d(vs AUS), 848(vsWI) ఉంది.