News June 3, 2024

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో TDP-9, YCP-2

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి RTV ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. వీరి ప్రకారం TDP-9, YCP-2, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలుస్తుందని తెలిపారు. దర్శి, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి స్థానాల్లో TDP పాగా వేస్తుందని, కందుకూరు, వై.పాలెంలో YCP గెలిచే అవకాశం ఉందన్నారు. కాగా చీరాలలో ఆమంచి గెలుస్తారన్నారు. దీంతో TDP శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

Similar News

News October 30, 2025

కురిచేడు: వాగులో చిక్కుకున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు

image

పొంగిన వాగులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిక్కుకుంది. ఈ ఘటన కురిచేడు మండలం వెంగాయపాలెం గ్రామం వద్ద చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్తున్న సమయంలో గుండ్లకమ్మ వాగు ఒక్కసారిగా తన విశ్వరూపం చూపటంతో ఈ ఘటన జరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు ట్రాక్టర్, తాళ్ల సహాయంతో బస్సును బయటికి తీసి ప్రయాణికులను కాపాడారు.

News October 30, 2025

వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్న అరెస్ట్..!

image

టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారం కేసులో ఒంగోలు మాజీ ఎంపీ, మాజీ TTD చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్నను నిన్న రాత్రి సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న బోలెబాబా డెయిరీ వేరొక డెయిరీని ముందు పెట్టి.. కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ విషయం తెలిసినా కమీషన్ల కోసం అంతా సైలెంట్ అయ్యారనే ఆరోపణలపైనా సిట్ విచారణ సాగిస్తుంది. ఈ క్రమంలో అప్పన్నను అరెస్ట్ చేశారు.

News October 30, 2025

ప్రకాశం: నేడు కూడా పాఠశాలలకు సెలవు

image

ప్రకాశం జిల్లాలోని వాగులు వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇవాళ కూడా అన్ని పాఠశాలలకు సెలవులు మంజూరు చేస్తూ డీఈవో కిరణ్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని డీఈవో తెలిపారు. ఇప్పటికే తుఫాన్ నేపథ్యంలో 3 రోజులపాటు సెలవు ప్రకటించగా.. తాజాగా మరొక రోజును పొడిగించినట్లు, ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.