News June 3, 2024

RTV ఎగ్జిట్ పోల్స్: ఉమ్మడి విశాఖలో జనసేన క్లీన్‌స్వీప్..!

image

ఉమ్మడి విశాఖలో 15 స్థానాల్లో TDP-8, YCP-2, జనసేన 4, BJP ఒక స్థానంలో విజయం సాధిస్తాయని RTV అంచనా వేసింది. అరకు, మాడుగలలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని తెలిపింది. విశాఖ నార్త్‌లో విష్ణుకుమార్ రాజు గెలుస్తారని అభిప్రాయ పడింది. జనసేన పోటీ చేసిన నాలుగు స్థానాలు పెందుర్తి, అనకాపల్లి, విశాఖ సౌత్, యలమంచిలిలో జెండా ఎగువేస్తుందని అంచనా వేసింది. మిగిలిన 8 స్థానాల్లో TDP గెలుస్తుందని తెలిపింది.

Similar News

News January 12, 2026

విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విద్యాధరి

image

విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ బదిలీ అయ్యారు. ఆయనను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించారు. విశాఖ నూతన జాయింట్ కలెక్టర్‌గా విద్యాధరి రానున్నారు. ఆమె గతంలో చిత్తూరు జిల్లా జేసీగా పనిచేశారు. త్వరలోనే బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

News January 12, 2026

విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో నేడు పీజీఆర్‌ఎస్

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.