News June 3, 2024

ఇది ప్రజాపాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం : కేటీఆర్

image

నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని పాతబస్తీ <<13368558>>హిందూపూర్ వాటర్ ట్యాంక్‌లో <<>>మృతదేహం లభించిన ఘటనపై ఎమ్మెల్యే కేటీఆర్‌ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ట్విటర్ (ఎక్స్) వేదికగా నిప్పులు చెరిగారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని విమర్శించారు.

Similar News

News August 31, 2025

NLG: అటకెక్కిన ఆటల పీరియడ్!

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆటల పీరియడ్ అటకెక్కింది. అటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ పీఈటీలు, మైదానాలు నిధుల కొరత వెక్కిరిస్తుంది. జిల్లాలో మెజారిటీ పీఈటీలు కాలక్షేపానికి, ఇతర విధులకు పరిమితమవుతున్నారన్న విమర్శలున్నాయి. ఇక ప్రైవేట్ పాఠశాలల్లో యాజమాన్యాలు క్రీడా కార్యక్రమాలను పట్టించుకోవడంలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంఈఓలు కార్యాలయాలకే పరిమితమయ్యారని విమర్శలు ఉన్నాయి.

News August 31, 2025

నల్గొండను ఎండబెట్టారు: మంత్రి కోమటిరెడ్డి

image

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రి జగదీశ్ రెడ్డి నల్గొండ జిల్లాకు నీళ్లు రాకుండా అడ్డుకుని ఎండబెట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై తాము సభలో మాట్లాడతామని స్పష్టం చేశారు. కవిత ‘లిల్లీపుట్’ వ్యాఖ్యలతో జగదీష్ రెడ్డి పరువు తీసిందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడం వల్లే రైతులకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు.

News August 31, 2025

NLG: పత్తి రైతు పరేషాన్.. దిగుబడిపై ప్రభావం

image

ఇటీవల జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా పత్తి చేలలో ఇంకా తడారలేదు. వరద నీటిలోనే మొక్కలు ఉండడం అధిక తడితో మొలకలు ఎర్రబారుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వానాకాలం సీజన్‌లో 5,64,585 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. మొక్కలు ఎదిగే సమయానికి భారీ వర్షాలు కురవడంతో చాలాచోట్ల పత్తి చేలల్లోకి నీళ్లు వచ్చాయని రైతులు తెలిపారు. దీంతో పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు.