News June 3, 2024
‘కల్కి’లో సీత?

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా ‘కల్కి 2898 AD’. ఈ మూవీలో ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి స్టార్లు భాగమయ్యారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్‌తో పాటు సీనియర్ నటి శోభన నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక పాత్రల్లో వీరిద్దరూ కనిపిస్తారని ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీనిపై మూవీ యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Similar News
News January 28, 2026
ఫ్లైట్లు/హెలికాప్టర్లు కూలగానే ఎందుకు కాలిపోతాయి?

ఫ్లైట్లు/హెలికాప్టర్లు కూలగానే క్షణాల్లో మంటలు చెలరేగడం, అందులో ప్రయాణికులు చిక్కుకొని ప్రాణాలు కోల్పోవడం చూస్తూనే ఉన్నాం. దీనికి ప్రధాన కారణం వాటిల్లో అధిక మోతాదులో ఉండే ఇంధనం. ఫ్లైట్లు/హెలికాప్టర్లు తీవ్రమైన వేగం/ఘర్షణతో కదులుతుంటాయి. ఆ సమయంలో ప్రమాదం జరిగితే రెక్కలు లేదా ట్యాంకులు పగిలి ఇంధనం బయటకు వస్తుంది. ఇంజిన్ వేడికి లేదా రాపిడి వల్ల వచ్చే నిప్పురవ్వలతో తక్షణమే మంటలు వ్యాపిస్తాయి.
News January 28, 2026
ఈనెల 31న ఆన్‌లైన్ జాబ్ మేళా

AP: పార్వతీపురం ఎంప్లాయిమెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో జనవరి 31న ఆన్‌లైన్ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 18 సంవత్సరాలు నిండిన ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైనవారు అర్హులు. రెండు కంపెనీల్లో 180 పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు. జాబ్ మేళా రిజిస్ట్రేషన్ లింక్ : https://forms.gle/vtBSqdutNxUZ2ESX8
News January 28, 2026
తెలంగాణ రెండో దేశీ విత్తన పండుగ

TG: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్పల్లిలోని ఎర్త్ సెంటర్లో ఫిబ్రవరి 6,7,8 తేదీల్లో తెలంగాణ రెండో దేశీ విత్తన పండుగను నిర్వహించనున్నారు. ‘భవిష్యత్ వ్యవసాయానికి దేశీ వంగడాల పరిరక్షణ అత్యంత ముఖ్యం’ అనే నినాదంతో కౌన్సెల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా దేశీ విత్తన పరిరక్షకులు, రైతులు, శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.


