News June 3, 2024

మరోసారి తండ్రయిన శివకార్తికేయన్

image

హీరో శివకార్తికేయన్ మరోసారి తండ్రయ్యారు. తన భార్య ఆర్తి నిన్న మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఆయన ట్వీట్ చేశారు. శివకార్తికేయన్-ఆర్తికి 2010లో వివాహమైంది. వారికి ఇప్పటికే కూతురు(ఆరాధన), కుమారుడు(గుగణ్) ఉన్నారు. ఇక శివకార్తికేయన్ ప్రస్తుతం రాజ్‌కుమార్ పెరియాస్వామి తెరకెక్కిస్తున్న ‘అమరన్’ మూవీలో నటిస్తున్నారు.

Similar News

News January 22, 2025

అమెరికా నుంచి 18000 మంది వెనక్కి!

image

డొనాల్డ్ ట్రంప్ పాలసీలకు తగినట్టు భారత్ ప్రణాళికలు వేసుకుంటోంది. USతో అనవసరంగా ట్రేడ్‌వార్ తెచ్చుకోకుండా ఉండేందుకు 18,000 అక్రమ వలసదారులను వెనక్కి తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. 2 దేశాలూ కలిసి వీరిని గుర్తించాయి. స్టూడెంట్, వర్క్ వీసాలతో లీగల్‌గా అక్కడికి వెళ్లినవారికి అడ్డంకులు రావొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. లేదంటే వీసాలు, గ్రీన్‌కార్డులు తగ్గించి ట్రంప్ తిప్పలు పెట్టొచ్చు.

News January 22, 2025

రిలేషన్‌కు బ్రేకప్ చెబుతారనే సంకేతాలు ఇవి..

image

సైకాలజిస్టుల ప్రకారం మీతో రిలేషన్‌ను మీ పార్ట్నర్ ముగించాలని డిసైడ్ అయితే ఇలా తెలుస్తుంది
– ఒకప్పటిలా మీతో సన్నిహితంగా ఉండకపోవడం/ సరిగా స్పందించకపోవడం/ కారణాలు ఎక్కువ చెప్పడం/ గొడవలు పెరగడం/కేరింగ్ & షేరింగ్ తగ్గడం
– తనతో ఫ్యూచర్ గురించి చెబితే అనాసక్తి చూపడం
– క్లోజ్ రిలేషన్ కాకుండా ఫార్మల్‌గా ఉండటం
– మరొకరితో పోల్చడం, ఇతరుల గురించి మాట్లాడటం
– ప్రతి విషయాన్ని గుచ్చి చూడటం, లెక్కగట్టడం

News January 22, 2025

టీమ్ఇండియా వికెట్ టేకర్‌ను ఫినిష్ చేసిన BCCI: ఆకాశ్ చోప్రా

image

యుజ్వేంద్ర చాహల్ పనైపోయినట్టేనని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నారు. CT సిరీసుకు ఎంపిక చేయకపోవడం ద్వారా BCCI, టీమ్ మేనేజ్‌మెంట్ అతడి కథను ముగించిందని పేర్కొన్నారు. వికెట్లు తీస్తున్నప్పటికీ రెండేళ్ల క్రితమే అతడిని వన్డేల నుంచి తప్పించారని గుర్తుచేశారు. ‘దేశవాళీ క్రికెట్ ఆడకపోవడంతో పొట్టి ఫార్మాట్లోనూ ఎంపిక చేయడం లేదు. ఇంత గ్యాప్ తర్వాత మళ్లీ అతడిని ఎంపిక చేస్తే తిరోగమన చర్యే అవుతుంది’ అన్నారు.