News June 3, 2024

ఏలూరు జిల్లాలో రేపు లోకల్ హాలిడే

image

ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏలూరు కలెక్టర్ వై.ప్రసన్న వెంకటేష్ జిల్లాలో రేపు లోకల్ హాలిడే ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడా ఎటువంటి అసాంఘిక సంఘటనలు, అల్లర్లకు తావు లేకుండా ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములు సహజమని.. ఎదుటి పార్టీపై కవ్వింపు చర్యలు, దుష్ప్రచారాలు చేస్తే చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News November 12, 2025

దివ్యాంగులకు ప్రభుత్వ సహకారం: కలెక్టర్ నాగరాణి

image

ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులను ఎంతో ఓర్పుతో సాకాల్సి ఉంటుందని కలెక్టర్ నాగరాణి అన్నారు. వారి ఇబ్బందులకు ఎల్లప్పుడూ ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని, ధైర్యంగా ఉండాలని ఆమె భరోసా ఇచ్చారు. భీమవరంలో గాలి రామయ్య మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న ‘భవిత విలీన విద్య వనరుల కేంద్రాన్ని సందర్శించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ బాలికలకు ఉచిత ఉపకరణాల పంపిణీ, వైద్య నిర్ధారణ శిబిరాన్ని పరిశీలించారు.

News November 12, 2025

ఆకివీడు: డిప్యూటీ సీఎం చొరవతో నేడు గృహప్రవేశం

image

చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్న ఆకివీడుకు చెందిన వృద్ధురాలు కంకణాల కృష్ణవేణి ఇళ్లు లేక ఇబ్బంది పడుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌ను గత మూడు నెలల క్రితం మంగళగిరిలో ఆమె పవన్‌ను కలిసి తన గోడును విన్నవించుకుంది. పవన్ ఆదేశాలతో ఇంటి నిర్మాణంలో భాగంగా, నేడు కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా కృష్ణవేణి గృహప్రవేశం చేసింది. సొంతింటి కల నెరవేరడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది.

News November 12, 2025

తణుకు: కూతురి హత్య కేసులో తల్లిదండ్రులు అరెస్ట్

image

తణుకు మండలం ముద్దాపురంలో మూడేళ్ల కిందట యువతి సజీవ దహనం కేసులో ఆమె తండ్రితో పాటు సవతి తల్లిని బుధవారం తణుకు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ కృష్ణ కుమార్ వివరాల మేరకు.. యువతికి చెందిన ఆస్తి కోసం సవతి తల్లి ముళ్లపూడి రూప, శ్రీనివాసు ఆమెను సజీవదహనం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అప్పట్లో పనిచేసిన పోలీసు అధికారుల పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.