News June 3, 2024
మానుకోట విద్యార్థికి పాలిటెక్నిక్‌లో స్టేట్ 5 ర్యాంకు

తెలంగాణ పాలిటెక్నిక్ పరీక్షా ఫలితాల్లో మానుకోట విద్యార్థి ముత్యాల పార్థసారథి గణితశాస్త్ర విభాగంలో స్టేట్ 5వర్యాంక్ సాధించాడు. స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో పార్థసారథి టెన్త్ చదువుకున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థిని మానుకోట జిల్లా కాంగ్రెస్ నాయకులు శంతన్ రామరాజు, ప్రైవేటు విద్యాసంస్థల జిల్లా అధ్యక్షుడు కమ్మగాని కృష్ణమూర్తి, తెలంగాణ ఉద్యమ ఫోరం నాయకులు నారాయణ్ సింగ్, తదితరులు అభినందించారు.
Similar News
News September 13, 2025
వరంగల్ జిల్లాలో తగ్గుముఖం పట్టిన వర్షాలు

వరంగల్ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు తేలికపాటి వర్షపాతం నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం, మొత్తం జిల్లా వ్యాప్తంగా 18.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. వీటిలో ఎక్కువ వర్షం నెక్కొండ మండలంలో 14.9 మి.మీగా నమోదు కాగా, పర్వతగిరిలో 2.7 మి.మీ, రాయపర్తిలో 0.5 మి.మీ వర్షం కురిసింది.
News September 12, 2025
ఎనుమాముల బియ్యం నిల్వ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

ఎనుమాముల మండల బియ్యం నిల్వ కేంద్రాన్ని కలెక్టర్ సత్య శారద ఆకస్మికంగా సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. నిల్వలో ఉన్న బియ్యం నాణ్యత, భద్రతా ఏర్పాట్లు, నిల్వ విధానం, రికార్డుల నిర్వహణను జాగ్రత్తగా పరిశీలించారు. సమర్థంగా నిర్వహణ కొనసాగించి రైతులకు, వినియోగదారులకు నాణ్యమైన బియ్యం అందేలా చర్యలు మరింత పటిష్టం చేయాలని సూచించారు.
News September 12, 2025
వరంగల్: బియ్యం నిల్వపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం

ఏనుమాముల బియ్యం నిల్వ కేంద్రంలో ముక్కిన బియ్యం, మధ్యాహ్న భోజన పథకం బియ్యాన్ని కలిపి ఉంచిన వ్యవహారంపై వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో తనిఖీలు నిర్వహించిన ఆమె, ఈ నిర్లక్ష్యానికి కారణమైన పౌరసరఫరాల డీఎం, ఎం.ఎల్.ఎస్. ఇన్‌ఛార్జిలకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.