News June 3, 2024

అక్టోబర్ 10న రజనీకాంత్vsఎన్టీఆర్?

image

రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘వెట్టయాన్’ సినిమా అక్టోబర్ 10న థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. ఈ విషయాన్ని రజనీయే స్వయంగా వెల్లడించారు. దీంతో అదే రోజు రిలీజ్ కానున్న ఎన్టీఆర్ ‘దేవర’కు ఈ మూవీ పోటీగా మారింది. అయితే దేవర రిలీజ్ డేట్ సెప్టెంబర్ 27కు మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ విడుదల తేదీ మారకుంటే అక్టోబర్ 10న బాక్స్ ఆఫీస్ వద్ద రజనీకాంత్, ఎన్టీఆర్ సినిమాల మధ్య పోటీ చూడవచ్చు.

Similar News

News January 22, 2025

ఐటీ సోదాలు అందరిపై జరుగుతున్నాయి: దిల్ రాజు

image

హైదరాబాద్‌లోని తన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరగడంపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. ‘సోదాలు నా ఒక్కడిపైనే జరగడం లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం జరుగుతున్నాయి’ అని అన్నారు. నిన్నటి నుంచి SVC, మైత్రి మూవీస్‌తో పాటు పలు సంస్థల కార్యాలయాలపై ఐటీ తనిఖీలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

News January 22, 2025

BJPకి కటీఫ్ చెప్పిన నితీశ్.. ట్విస్ట్ ఏంటంటే!

image

బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ బీజేపీకి షాకిచ్చారు. మణిపుర్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. అక్కడ ఆ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే 5 స్థానాలున్న NPP సైతం మద్దతు వెనక్కి తీసుకుంది. 60 స్థానాలున్న మణిపుర్ అసెంబ్లీలో ప్రస్తుతం NDA బలం 45కు తగ్గింది. ఇక్కడ బీజేపీకి సొంతంగా 37 సీట్లు ఉన్నాయి. అధికారానికి 31 చాలు.

News January 22, 2025

నోటిఫికేషన్ వచ్చేసింది..

image

UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) నోటిఫికేషన్ రిలీజైంది. 979 పోస్టుల భర్తీకి జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు. మే 25న ప్రిలిమ్స్ జరగనుంది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు, 21-32 ఏళ్ల వయసు ఉన్నవారు దీనికి అర్హులు. దరఖాస్తు చేసుకునేందుకు సైట్: <>https://upsconline.gov.in<<>>