News June 3, 2024

బెంగళూరులో 133 ఏళ్ల రికార్డు బ్రేక్

image

బెంగళూరులో నిన్న ఒక్కరోజే దాదాపు 111mm వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ నెలలో ఒక్కరోజే ఈ స్థాయి వర్షం కురవడం గత 133 ఏళ్లలో ఇదే తొలిసారి అని తెలిపింది. ఈనెల 1, 2 తేదీల్లో కలిపి మొత్తం 140.7mm వర్షపాతం నమోదైందని, ఏటా జూన్ నెల మొత్తంలో కురిసే సగటు వర్షపాతాన్ని (110.3mm) ఇప్పటికే అధిగమించినట్లు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించాయని తెలిపింది.

Similar News

News January 22, 2025

Stock Markets: రిలీఫ్ ర్యాలీతో ఇన్వెస్టర్లు ఖుష్..

image

స్టాక్‌మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, విలువైన షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. నిఫ్టీ 23,155 (+130), సెన్సెక్స్ 76,404 (+566) వద్ద క్లోజయ్యాయి. IT, ఫార్మా, హెల్త్‌కేర్, ఫైనాన్స్ షేర్లు పుంజుకున్నాయి. రియాల్టి షేర్లు రక్తమోడాయి. విప్రో, ఇన్ఫీ, టీసీఎస్, టెక్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు టాప్ గెయినర్స్.

News January 22, 2025

రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం?

image

AP: కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మార్కెట్ విలువ, బుక్ వాల్యూ మధ్య తేడాలున్నాయని, వీటిని సరిచేసి రిజిస్ట్రేషన్ ధరలు పెంచుతారని సమాచారం. దీనిపై సీఎం చంద్రబాబు త్వరలోనే స్పష్టత ఇస్తారని వార్తలు వస్తున్నాయి.

News January 22, 2025

ఐటీ సోదాలు అందరిపై జరుగుతున్నాయి: దిల్ రాజు

image

హైదరాబాద్‌లోని తన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరగడంపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. ‘సోదాలు నా ఒక్కడిపైనే జరగడం లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం జరుగుతున్నాయి’ అని అన్నారు. నిన్నటి నుంచి SVC, మైత్రి మూవీస్‌తో పాటు పలు సంస్థల కార్యాలయాలపై ఐటీ తనిఖీలు జరుగుతున్న సంగతి తెలిసిందే.