News June 4, 2024

ఎల్-నినో పోయి లా నినా ఎంట్రీ?

image

ఎల్-నినో ప్రభావంతో నమోదవుతున్న రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలకు ఇక తెరపడే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది. ‘జూలై-సెప్టెంబరు మధ్య లా నినా ఏర్పడే అవకాశం ఉంది. ఫలితంగా రుతుపవనాల సీజన్‌లో మంచి వర్షాలు పడొచ్చు. జూలై-ఆగస్టులో తటస్థ పరిస్థితులు నెలకొనడానికి, లా నినా ఏర్పడటానికి 50-50 అవకాశాలు ఉన్నాయి. లా నినా ఏర్పడటానికి JUL-SEP మధ్య 60%, ఆగస్టు నుంచి NOV మధ్య 70% ఛాన్స్ ఉంది’ అని తెలిపింది.

Similar News

News October 10, 2024

ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం: మహేశ్‌ ఫ్యాన్స్

image

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎంతోమంది పిల్లలకు గుండె సర్జరీలతో ప్రాణదానం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన చేసిన సాయం రిత్విక అనే చిన్నారిని రక్షించిందంటూ APలోని కత్తులవారి పేటలో ఆయన ఫ్యాన్స్ పెట్టిన ఫ్లెక్సీ ఆకట్టుకుంటోంది. ‘నువ్వు కాపాడిన 3772వ ప్రాణం సామీ. నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు. మాకు నమ్మించే అక్కర లేదు. ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం’ అంటూ ఖలేజా డైలాగ్‌తో ఫ్లెక్సీ రూపొందించారు.

News October 10, 2024

పావురాలు వదులుతాడు.. చోరీ చేస్తాడు!

image

బెంగళూరుకు చెందిన మంజునాథ్(38)కు పావురాల్ని పెంచడం హాబీ. పగటిపూట జనం ఆఫీసులకు, ఊళ్లకు వెళ్లిన టైమ్‌లో వాటితో వీధుల్లో తిరుగుతూ ఇళ్ల మీదకు వదులుతుంటాడు. తిరిగి పట్టుకునే వంకతో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీ చేస్తాడు. ఆలోపు ఎవరికైనా అనుమానం వచ్చి ప్రశ్నిస్తే తన పావురాల కోసం వచ్చానని చెప్పి తప్పించుకుంటాడు. ఇలా 50 ఇళ్లలో చోరీలు చేశాడు. ఎట్టకేలకు తాజాగా పోలీసులకు చిక్కాడు.

News October 10, 2024

టాటా మృతి పట్ల ప్రముఖ వ్యాపారవేత్తల సంతాపం

image

దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని వ్యాపారవేత్తలు హర్ష గోయెంకా, ఆనంద్ మహీంద్రా, గౌతమ్ ఆదానీ ట్వీట్లు చేశారు. టాటా ఇకపై లేరన్న విషయాన్ని తాను స్వీకరించలేకపోతున్నానని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. దేశం దిశను పునర్నిర్వచించిన గొప్ప వ్యక్తిని భారత్ కోల్పోయిందని అదానీ ట్వీట్ చేశారు. వ్యాపార ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన టాటా ఇక లేరని హర్ష గోయెంకా పేర్కొన్నారు.