News June 4, 2024

MP RESULTS: మొదట నల్గొండ, తర్వాత భువనగిరి

image

NLG, BNR లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. MLGలో తొలుత లెక్కింపు పూర్తవనుండగా.. ఆ తర్వాత వరుసగా SRPT, NLG, KDD, HNR, సాగర్‌ చివరగా DVK ఓట్ల లెక్కింపు పూర్తవనుంది. BNR లోక్‌సభ పరిధి ఇబ్రహీంపట్నంలో 343 పోలింగ్‌ స్టేషన్లుండగా .. ఇక్కడ 20 టేబుళ్లను, మునుగోడు, తుంగతుర్తి, BNR, NKL, ALR, జనగామలో 14 టేబుళ్లలో ఓట్లను లెక్కించనున్నారు. మొదట నల్గొండ, తర్వాత భువనగిరి ఎంపీ ఎవరో తేలనుంది.

Similar News

News September 14, 2025

NLG: తెప్ప తిరగబడి మత్స్యకారుడి మృతి

image

చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ మత్య్సకారుడు మృతిచెందాడు. ఈ ఘటన శనివారం జరగ్గా ఆదివారం మృతదేహం లభ్యమైంది. మాడుగులపల్లి (M) గజలాపురం గ్రామానికి చెందిన సింగం యాదగిరి (37) ఈనెల 13న చేపలు పట్టేందుకు అతని కొడుకు వరుణ్ తేజ్‌తో కలిసి పానగల్ ఉదయ సముద్రం కట్ట వద్దకు వెళ్లాడు. ఒక్కసారిగా వర్షం కురిసి, బలమైన గాలికి తెప్ప ప్రమాదవశాత్తు తిరగబడి యాదగిరి చెరువులో మునిగి మృతి చెందాడు.

News September 14, 2025

నకిరేకల్‌లో టీచర్‌పై పోక్సో కేసు నమోదు

image

నకిరేకల్ జడ్పీహెచ్ఎస్‌ ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు మామిడి శ్రీనివాస్‌పై పోక్సో కేసు నమోదైంది. పదో తరగతి విద్యార్థినిని మూడు నెలలుగా వేధిస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన నకిరేకల్ పోలీసులు ఆరోపణలు నిర్ధారించుకుని ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

News September 14, 2025

నల్గొండ: లోక్ అదాలత్‌లో 13,814 కేసుల పరిష్కారం

image

జాతీయ మెగా లోక్ అదాలత్‌లో నల్గొండ జిల్లాలో 13,814 కేసులు పరిష్కారమయ్యాయి. జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు లోక్ అదాలత్‌ విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరించిన 135 సైబర్ క్రైమ్ కేసుల బాధితులకు రూ. 54,08,392 తిరిగి చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు.