News June 4, 2024
2 గంటలకు నెల్లూరు సిటీ ఫలితం?

నెల్లూరు సిటీ 18, సర్వేపల్లి 21, కావలి 23 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. కందుకూరు, ఆత్మకూరు 20 రౌండ్లలో, కోవూరు, ఉదయగిరి 24.. నెల్లూరు రూరల్, సర్వేపల్లి ఓట్ల లెక్కింపు 21 రౌండ్లలో కొనసాగనుంది. ఒక్కో రౌండ్‌కు అరగంట పట్టినా.. నెల్లూరు సిటీ తుది ఫలితం మధ్యాహ్నం 2 గంటలకు తేలుతుంది. కందుకూరు, ఆత్మకూరు, నెల్లూరు రూరల్, సర్వేపల్లి MLA ఎవరనేది 3 గంటలకు తెలిసిపోతుంది. మిగిలిన ఫలితాలు 4 గంటలకు వస్తాయి.
Similar News
News January 18, 2026
నెల్లూరు: 9లక్షలకు పైగానే ఫ్రీ బస్ ఎక్కారు..!

సంక్రాంతి కావడంతో ఆర్టీసీ బస్సులన్నీ మహిళలతో కిటకిటలాడాయి. ప్రభుత్వం స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టాక వచ్చిన తొలి సంక్రాంతి కావడంతో మహిళలు సొంతూళ్లకు ఉచితంగా ప్రయాణం చేశారు. ఈనెల 8 నుంచి 16వ వరకు నెల్లూరు జిల్లాలోని 7 డిపోల పరిధిలో 9,55,083 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. ఇందుకు గాను ప్రభుత్వంపై రూ.3,89,85,130 భారం పడింది.
News January 18, 2026
వాహనదారులకు నెల్లూరు ఎస్పీ సూచనలు

నెల్లూరు జిల్లాలో పొగ మంచు ఎక్కువైంది. ఈక్రమంలో వాహనదారులకు ఎస్పీ డా.అజిత వేజెండ్ల పలు సూచనలు చేశారు. వాహనదారులు వేగం తగ్గించి, ఫాగ్ లైట్లు ఉపయోగించాలన్నారు. వాహనాల మధ్య దూరం పాటించాలని కోరారు. హజార్డ్ లైట్స్ ఆన్ చేయడంతో పాటు, డి ఫాగర్ ఆన్‌లో ఉంచాలన్నారు. ఈ నియమాలను పాటిస్తూ వాహనదారులు సురక్షితంగా తమ గమ్యాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
News January 18, 2026
నెల్లూరోళ్లు రూ.23.17 కోట్ల మద్యం తాగేశారు..!

నెల్లూరు జిల్లాలో సంక్రాంతి ఘనంగా జరిగింది. 3రోజులు ప్రజలు ఆహ్లాదంగా గడిపారు. మందుబాబులు మత్తులో మునిగి తేలారు. ఫలితంగా జిల్లాలోని వైన్ షాపులన్నీ కిటకిటలాడాయి. పల్లె, పట్టణమనే తేడా లేకుండా జిల్లా అంతటా మద్యం ఏరులైపారింది. 14 నుంచి 16వ తేదీ రాత్రి వరకు రూ.23.17 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా రూ. 2.06. కోట్ల మేర వ్యాపారం జరిగింది.


