News June 4, 2024

కోడ్‌ ముగిసినా పలు రాష్ట్రాల్లో కేంద్ర బలగాలు

image

ఎన్నికల ఫలితాల తర్వాత అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరగకుండా AP సహా కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర బలగాల సేవలను కొనసాగించాలని EC నిర్ణయించింది. కోడ్‌ ముగిసినా బలగాలను మోహరించడం ఇదే తొలిసారి కానుంది. AP, బెంగాల్, UP, మణిపుర్‌ వంటి రాష్ట్రాల్లో 15 రోజుల పాటు ఇవి అందుబాటులో ఉంటాయి. హింసకు ఆస్కారం ఉండదని తాము నమ్ముతున్నా, అలాంటి అవకాశం తలెత్తే రాష్ట్రాల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

Similar News

News January 22, 2025

ఆ మూర్ఖులను కఠినంగా శిక్షించండి

image

పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో <<15226066>>మంటలొచ్చాయని<<>> వదంతులు సృష్టించిన మూర్ఖులను గుర్తించి కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంతంగా వెళ్తోన్న రైలులో మంటలు చెలరేగాయని ప్రాంక్ చేసి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేయడం వల్లే అన్యాయంగా 8 మంది చనిపోయారని మండిపడుతున్నారు. వదంతులు సృష్టించిన వారిని శిక్షించి, ఇంకోసారి ఎవరూ ఇలా చేయకుండా భయాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

News January 22, 2025

ఆటో డ్రైవర్‌కు రూ.50,000?

image

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌కు రూ.50 వేలు బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 16న దొంగచేతిలో కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడిన ఈ హీరోను ఆటో డ్రైవర్ సమయానికి ఆసుపత్రికి చేర్చారు.

News January 22, 2025

జేడీయూ U టర్న్.. బీజేపీతోనే ఉన్నామని ప్రకటన

image

మణిపుర్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్టు వచ్చిన వార్తలపై జేడీయూ స్పందించింది. సెంట్రల్ లీడర్‌షిప్‌కు తెలియకుండానే లోకల్ చీఫ్ క్షేత్రిమయుమ్ బిరేన్ సొంతంగా గవర్నర్‌కు లేఖరాశారని వివరణ ఇచ్చింది. క్రమశిక్షణా రాహిత్యం కింద వెంటనే అతడిని బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ తెలిపారు. తాము బీజేపీకే మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు.