News June 4, 2024

శ్రీకాకుళం: ఓట్ల లెక్కింపులో పాల్గొననున్న ఏజెంట్లు వివరాలు

image

సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు మరికొద్ది సేపట్లో తెలియనున్నాయి. ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కింపు ప్రక్రియ చేపట్టేందుకు 9 మంది రిటర్నింగ్‌ అధికారులు, 77 మంది అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, 492 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, 582 మంది కౌంటింగ్‌ అసిస్టెంట్‌లు, 397మంది మైక్రో అబ్జర్వర్లు, 439 మంది క్లాస్‌-4 ఉద్యోగులు మొత్తం 1996 మంది సిబ్బంది ఎటువంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు.

Similar News

News September 14, 2025

శ్రీకాకుళం: పండగల వేళ స్పెషల్ ట్రైన్స్

image

దసరా, దీపావళి సందర్భంగా శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా చెన్నై సెంట్రల్(MAS), బరౌని(BJU) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.06039 MAS- BJU ట్రైన్‌ను నేటి నుంచి NOV 30 వరకు ప్రతి ఆదివారం, నం.06040 BJU- MAS ట్రైన్‌ను SEPT 17 నుంచి DEC 3 వరకు ప్రతి బుధవారం నడుపుతామన్నారు. ఈ ట్రైన్లు ఏపీలో రాజమండ్రి, ఏలూరు, విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News September 14, 2025

శ్రీకాకుళం డీఈఓగా రవిబాబు

image

శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారిగా రవిబాబుకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ శనివారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. DEO కార్యాలయంలో ADగా పనిచేస్తున్న రవిబాబును ఇప్పటివరకు ఇన్‌ఛార్జి DEOగా కొనసాగారు. జిల్లాలో విద్యా శాఖ అభివృద్ధికి అధికారుల సహాయంతో ముందడుగు వేస్తానని ఆయన అన్నారు.

News September 14, 2025

శ్రీకాకుళం: ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి

image

ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటిస్తే వస్తువులు, నగదు పొగోట్టుకునే అవకాశం తక్కువుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు చెకింగ్ చేసుకుంటే సామగ్రిని కాపాడుకోవచ్చు. ఇలాంటి చేదు అనుభవం శనివారం ఓ ప్రయాణికుడికి ఎదురైంది. శ్రీకాకుళంలోని టీసీబీకాలనీకి చెందిన ప్రణీత్ ఆర్టీసీ బస్సులో ఫోన్ మర్చిపోయి ఇంటికెళ్లి కాల్ చేశాడు. డ్రైవర్, కండక్టర్ వద్ద ఫోన్ సురక్షితంగా ఉందని తెలిసి సంతోషించాడు. అనంతరం బాధితుడికి మొబైల్ ఇచ్చారు.