News June 4, 2024

ఉరవకొండ, సింగనమల ‘స్పెషాలిటీ’ రిపీటయ్యేనా?

image

AP: రాష్ట్రంలో ఉరవకొండ, శింగనమల(అనంతపురంD) సెగ్మెంట్లకు ఓ ప్రత్యేకత ఉంది. ఉరవకొండలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోతుంది. శింగనమలలో గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుంది. దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. దీంతో వీటి ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. శింగనమలలో వీరాంజనేయులు(YCP), శ్రావణి(TDP), శైలజానాథ్(INC), ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి(YCP), పయ్యావుల కేశవ్(TDP) బరిలో ఉన్నారు.

Similar News

News October 9, 2024

ENGvsPAK: రూట్ సూపర్ సెంచరీ

image

ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ పాక్‌పై సెంచరీతో చెలరేగారు. ముల్తాన్‌లో జరుగుతోన్న టెస్టు మ్యాచులో ఆయన తన 35వ టెస్టు సెంచరీని పూర్తిచేసుకున్నారు. దీంతో అన్ని ఫార్మాట్లలో రూట్ 51 సెంచరీలు పూర్తిచేసుకున్నారు. అలాగే అత్యధిక సెంచరీలు చేసిన రెండో యాక్టివ్ ప్లేయర్‌గా నిలిచారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 80 సెంచరీలతో ప్రథమ స్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (48), కేన్ (45), స్మిత్ (44) ఉన్నారు.

News October 9, 2024

రిచెస్ట్ నటి.. ఆమె ఆస్తి రూ.66వేల కోట్లు!

image

ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన నటుడిగా $1.4 బిలియన్లతో టైలర్ పెర్రీ నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకంటే కూడా సినీరంగంలో మోస్ట్ రిచెస్ట్ నటి ఉన్నారని ఫోర్బ్స్ తెలిపింది. అమెరికన్ నటి జామీ గెర్ట్జ్ ప్రపంచంలోనే ధనవంతురాలని పేర్కొంది. గెర్ట్జ్ నికర విలువ $8 బిలియన్లు ( ₹ 66,000+ కోట్లు). ఆ తర్వాతి స్థానాల్లో టేలర్ స్విఫ్ట్ ($1.6 బిలియన్), రిహన్నా ($1.4 బిలియన్), సెలెనా గోమెజ్ ($1.3 బిలియన్) ఉన్నారు.

News October 9, 2024

ప్రముఖ నటుడు కన్నుమూత

image

ప్రముఖ మలయాళ సీనియర్ నటుడు టీపీ మాధవన్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు. తాజాగా ఆయన కొల్లంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చనిపోయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. బహుముఖ పాత్రలకు పేరుగాంచిన మాధవన్ 600కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన 2016లో విడుదలైన ‘మాల్గుడి డేస్‌’లో చివరగా నటించారు.