News June 4, 2024

వారణాసిలో మోదీ.. వయనాడ్‌లో రాహుల్ ఆధిక్యం

image

వారణాసి నుంచి పోటీలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆధిక్యంలో ఉన్నారు. అటు వయనాడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ లీడ్ కనబరుస్తున్నారు. మరోవైపు మండిలో BJP MP అభ్యర్థి కంగనా రనౌత్ వెనుకబడగా, బారామతిలో NCP శరద్ వర్గం నుంచి బరిలో నిలిచిన సుప్రియా సూలే లీడ్‌లో ఉన్నారు. మరోవైపు బీహార్‌లో లాలూ కూతుళ్లు ఇద్దరూ వెనకబడ్డారు. పాటలీపుత్రలో మీసా భారతి, సరన్ నుంచి రోహిణి NDA అభ్యర్థుల కంటే వెనకంజలో ఉన్నారు.

Similar News

News October 9, 2024

హైదరాబాద్‌లో ఉద్రిక్తత.. MRPS ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

image

TG: HYDలోని పార్శీగుట్ట ఎమ్మార్పీఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్సీ వర్గీకరణ చేయకుండా డీఎస్సీ ఉద్యోగాలను భర్తీ చేయడంపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణతో పాటు నేతలు నిరసనకు దిగారు. పార్శీగుట్ట నుంచి ట్యాంక్ బండ్ వరకు ర్యాలీగా బయలుదేరగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.

News October 9, 2024

ఆ వార్డులో YCPకి ఒక్క ఓటు.. ఇదెలా సాధ్యం: VSR

image

AP: హరియాణా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో APని ప్రస్తావిస్తూ MP విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల ఫలితాలప్పుడు తొలి 4దశల్లో జరిగిన పోలింగ్‌లో BJPకి ఎదురుగాలి వీచింది. ఐదు, ఆరు దశల్లో, APలో జరిగిన ఎన్నికల్లో EVMల ట్యాంపరింగ్ చేశారు. CBN కుట్ర ఇది. హిందూపురంలో ఓ వార్డులో YCPకి ఒక్క ఓటు వచ్చింది. ఇది సాధ్యమా? ఈ మోసాలను కప్పిపుచ్చడానికి తిరుమల లడ్డూ వివాదం తెరపైకి తెచ్చారు’ అని ఆరోపించారు.

News October 9, 2024

యూపీఐ వాలెట్, ట్రాన్సాక్షన్ లిమిట్ పెంపు

image

డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను మరింత ప్రోత్సహించేలా UPI వాలెట్ పరిమితిని రూ. 2000 నుంచి రూ.5వేలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ప్రతి లావాదేవీకి UPI పరిమితిని రూ.500 నుంచి రూ.1000కి, UPI 123పే లావాదేవీల లిమిట్‌ను రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. పిన్ అవసరం లేకుండా పేమెంట్స్ చేసేందుకు UPI వాలెట్, ఫీచర్ ఫోన్లు వాడే వారి కోసం యూపీఐ123పే ఉపయోగపడుతుంది.