News June 4, 2024
2019లో నోటా ఓట్ల లెక్క

2019 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నోటాకు 65,22,772 ఓట్లు పోల్ అయ్యాయి. బిహార్‌లో అత్యధికంగా 8.16 లక్షల ఓట్లు, ఉత్తరప్రదేశ్‌లో 7.25 లక్షలు, తమిళనాడులో 5.50 లక్షల ఓట్లు, పశ్చిమ బెంగాల్‌లో 5.46 లక్షల ఓట్లు, మహారాష్ట్రలో 4.88 లక్షల ఓట్లు పోలయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో 1.28% ఓట్లు నోటాకు పోలయ్యాయి.
Similar News
News September 9, 2025
‘స్వదేశీ మేళా’లు నిర్వహించండి.. NDA ఎంపీలకు ప్రధాని పిలుపు

మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు NDA ఎంపీలు ‘స్వదేశీ మేళా’లను నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. GST రేట్ల తగ్గింపుపై వ్యాపారులతో సమావేశాలు నిర్వహించాలని, GST సంస్కరణలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు MPలు తమ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో NDA MPలతో ఆయన సమావేశమయ్యారు. ఓటు వృథా కాకుండా సరైన పద్ధతిలో వేయాలన్నారు.
News September 9, 2025
పంజాబ్ వరదలు.. భజ్జీ మంచి మనసు

భారీ వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరైన పంజాబ్‌కు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ తన వంతు సాయం చేశారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు 11 స్టీమర్ బోట్లు, 3 అంబులెన్సులు, రూ.50 లక్షలను సేకరించి విరాళంగా అందించారు. కాగా భారీ వర్షాలకు పలు ఘటనల్లో పంజాబ్‌లో 48 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వరదలతో పంట నష్టపోయిన చోట ఎకరాకు రికార్డు స్థాయిలో రూ.20 వేల పరిహారం ప్రభుత్వం ప్రకటించింది.
News September 9, 2025
ఆ కంపెనీలపై ట్రంప్ పన్ను పోటు!

అమెరికాలో విదేశీ వర్కర్లను నియమించుకునే కంపెనీలపై 25 శాతం అదనంగా పన్నులు విధించాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పన్నులు ఈ ఏడాది డిసెంబర్ 31 తర్వాత అమలు చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికన్లకే ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో ఈ విధానం తీసుకొస్తున్నట్లు సమాచారం.