News June 4, 2024

వెనుకంజలో లాలూ ‘డాటర్స్’

image

బిహార్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆర్జేడీ నుంచి ఇక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ వారసులే ఎక్కువగా పోటీ చేస్తున్నారు. బ్యాలెట్ ఓట్లలో వారి కుమార్తెలు వెనుకంజలో ఉన్నారని అప్డేట్స్ వస్తున్నాయి. సరణ్‌లో రాజీవ్ ప్రతాప్ రూఢీకి రోహిణీ ఆచార్య పోటీనివ్వలేకపోతున్నారు. పాటలీపుత్రలో మీసా భారతికి కష్టాలు ఎదురవుతున్నాయి. రామ్ కృపాల్ యాదవ్‌ ముందంజలో ఉన్నారు.

Similar News

News October 9, 2024

భర్త మృతి.. మరణమైనా నీతోనే అంటూ భార్య ఆత్మహత్య

image

AP: కోటి కలలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన ఆ ప్రేమ జంట ఆనందం ఎక్కువ కాలం నిలువలేదు. విధి ఇద్దరినీ బలి తీసుకుంది. విజయవాడకు చెందిన నాగరాజు(29), ఉష(22) ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి 18నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. సోమవారం రోడ్డు ప్రమాదంలో నాగరాజు చనిపోయాడు. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని రక్తపు మడుగులో చూసి ఉష గుండె తల్లడిల్లింది. ప్రాణసఖుడు లేని లోకంలో తాను ఉండలేనంటూ ఉరి వేసుకుంది.

News October 9, 2024

సంక్రాంతికి రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’?

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా సంక్రాంతికి రిలీజయ్యే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి. క్రిస్మస్‌కి బదులు సంక్రాంతికి రిలీజ్ చేస్తే సెలవులు కలిసొస్తాయని మేకర్స్ అనుకుంటున్నట్లు తెలిపాయి. జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇక వెంకటేశ్-అనిల్ రావిపూడి మూవీ జనవరి 14న విడుదలవనుండగా, మెగాస్టార్ ‘విశ్వంభర’ ఉగాదికి వచ్చే అవకాశం ఉంది.

News October 9, 2024

వాహనాలు 15ఏళ్లు దాటినా వాడుకోవచ్చు కానీ..

image

TG: రాష్ట్రంలో 15ఏళ్లు దాటిన వాహనాలను తప్పనిసరిగా తుక్కుగా మార్చాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ‘వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ని అమల్లోకి తెచ్చింది. ఆ వాహనాలు ఫిట్‌గా ఉన్నాయనిపిస్తే నడుపుకోవచ్చు. అయితే తదుపరి 5ఏళ్లకు ₹5K, మరో పదేళ్లకు ₹10K గ్రీన్ ట్యాక్స్ చెల్లించాలి. పాత వాహనాన్ని తుక్కుగా మార్చాలా వద్దా అనేది యజమాని నిర్ణయించుకుంటారు. మారిస్తే తర్వాతి వాహనానికి రాయితీ వస్తుంది.