News June 4, 2024

ఆధిక్యంలో MIM అభ్యర్థి అసదుద్దీన్

image

హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి మాధవీలతపై ముందంజలో ఉన్నారు.

Similar News

News January 13, 2026

భోగి మంటల్లో ఏం వేయాలి? ఏం వేయకూడదంటే?

image

భోగి మంటల్లో పాత వస్తువులను కాల్చాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్, రబ్బర్, టైర్లను వేయకూడదు. వీటి వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. ఆ విషపూరిత పొగ వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఆవు పిడకలు, ఔషధ గుణాలున్న కట్టెలు వేయాలి. ఇలాంటి హానికరమైన పదార్థాలను వాడటం శ్రేయస్కరం కాదు. పర్యావరణాన్ని కాపాడుతూ, మన ఆరోగ్యానికి భంగం కలగకుండా భోగి వేడుకలను జరుపుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

News January 13, 2026

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు మన సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. సెన్సెక్స్ 159 పాయింట్లు లాభపడి 84,038 వద్ద.. నిఫ్టీ 45 పాయింట్లు పెరిగి 25,836 దగ్గర ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌-30 సూచీలో ఎటర్నల్, టెక్ మహీంద్రా, SBI, BEL, HDFC బ్యాంక్ షేర్లు లాభాల్లో.. ఎల్ అండ్ టీ, TCS, రిలయన్స్, M&M, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

News January 13, 2026

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పబ్లిక్ టాక్

image

రవితేజ-కిశోర్ తిరుమల కాంబోలో రూపొందిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం ఇవాళ రిలీజైంది. విదేశాల్లో ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు తమ అనుభవాలను SM వేదికగా పంచుకుంటున్నారు. ‘స్టోరీ, స్క్రీన్ ప్లే రొటీన్‌లా అనిపించినా ఫస్ట్ హాఫ్‌లో కామెడీ మెప్పిస్తుంది. పాటలు ఆకట్టుకుంటాయి. కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి’ అని కామెంట్స్ చేస్తున్నారు. కాసేపట్లో Way2Newsలో మూవీ రివ్యూ&రేటింగ్.