News June 4, 2024

గుజరాత్‌లో బీజేపీ, తమిళనాడులో డీఎంకే లీడింగ్

image

గుజరాత్‌లో బీజేపీ మొత్తం 26 స్థానాల్లో లీడింగ్‌లో దూసుకెళ్తున్నాయి. తమిళనాడులో డీఎంకే 14, కాంగ్రెస్ 5 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. మహారాష్ట్రలో 7 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ 6 స్థానాల్లో, సేన 4, NCP SP 3, SS UBT 6 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతున్నాయి. అటు కర్ణాటకలో 8 చోట్ల బీజేపీ, 7 చోట్ల INC, 2 చోట్ల JDS, కేరళలో 16 స్థానాల్లో UDF, 4 స్థానాల్లో LDF ఆధిక్యంలో ఉన్నాయి.

Similar News

News January 14, 2026

భోగి పండ్లు ఎలా, ఎప్పుడు పోయాలి?

image

భోగి సందర్భంగా ఇవాళ చిన్నారులపై భోగి పండ్లు పోసే సంప్రదాయం తరతరాలుగా వస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం మేరకు.. చెరకు ముక్కలు, రేగి పండ్లు, పైసలు కలిపి పిల్లలను కూర్చోబెట్టి దిగదుడుపు తీసి తలమీద నుంచి కిందకు వదిలేయాలి. దీంతో భోగి పీడ తొలగిపోయి వాళ్లు భోగం అనుభవించడానికి కావలసిన శక్తిని పొందుతారు. అయితే సాయంత్రం వేళ వీటిని పోస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు.

News January 14, 2026

ఏపీ, తెలంగాణలో ఏప్రిల్ నుంచి ‘SIR’

image

AP, TGలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను ఏప్రిల్, మే నెలల్లో పూర్తి చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి. బిహార్‌లో తొలి దశ ముగియడంతో రెండో దశను 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్, TN, UP, WB సహా పలు ప్రాంతాల్లో ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దీంతో మూడో దశలో ఏపీ, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ‘సర్’ చేపట్టనున్నారు.

News January 14, 2026

ఊల వేసిన మడిలో నీరుంటుందా?

image

పూర్తిగా పొడిబారిన లేదా ఇసుకతో కూడిన భూమి నీరు త్వరగా ఇంకిపోయే గుణం కలిగి ఉంటుంది. ఆ నేలలో లేదా మడిలో నీరు పోసిన వెంటనే ఇంకిపోతుంది తప్ప, నిలబడి ఉండదు. అలాగే ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎంత జ్ఞానం బోధించినా, గ్రహించే బుద్ధిలేని వ్యక్తికి అవి ఏమాత్రం ఉపయోగపడవు. ఊల మడిలో వేసిన నీరులాగే ఇంకిపోతాయి. మంచి సలహా ఇచ్చినా దాన్ని స్వీకరించే మనస్తత్వం లేని వారి గురించి చెప్పేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.