News June 4, 2024

BIG BREAKING: ఖాతా తెరవని కారు

image

ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగా తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంది. ప్రస్తుతం వెల్లడవుతున్న ఫలితాల్లో బీఆర్ఎస్ ఒక్క చోట కూడా ఆధిక్యత కనబర్చడం లేదు. ప్రభుత్వ వ్యతిరేకతను బీజేపీ అనుకూలంగా మలుచుకోగా ఇందులో గులాబీ పార్టీ విఫలమైందని స్పష్టమవుతోంది.

Similar News

News November 8, 2025

మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మేనేజర్ పోస్టులు

image

మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 17 కాంట్రాక్ట్ మేనేజర్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. బీఈ, బీటెక్‌తో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ మేనేజర్లకు నెలకు రూ.70వేలు, జూనియర్ మేనేజర్‌లకు రూ.30వేల జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ddpdoo.gov.in/

News November 8, 2025

ALERT: పశువులకు ఈ టీకా వేయించారా?

image

తెలుగు రాష్ట్రాల్లో పశువుల్లో ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేస్తున్నారు. ఈ నెల 14 వరకు అన్ని జిల్లాల్లో పశువులకు వీటిని అందించనున్నారు. 4నెలల వయసు పైబడిన పశువులు అన్నింటికీ ఈ వ్యాక్సిన్స్ వేస్తారు. పశుపోషకుల ఇళ్ల వద్దకే సిబ్బంది వచ్చి ఉచితంగా టీకాలు అందిస్తున్నారు. ఈ టీకాను పశువులకు వేయించడంలో పాడి రైతులు నిర్లక్ష్యం చేయొద్దు.✍️ రోజూ సాగు, పాడి సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News November 8, 2025

పశువుల్లో గాలికుంటు వ్యాధి లక్షణాలు

image

ఈ వ్యాధి సోకిన పశువులకు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3, 4 వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారతాయి. చర్మం గరుకుగా మారి నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం వల్ల పశువులు మేత మేయలేవు. నీరసంగా ఉంటాయి. పశువుకు 104 నుంచి 105 డిగ్రీల ఫారన్ హీట్ వరకు జ్వరం ఉంటుంది. పాడిగేదెల్లో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఎద్దుల్లో రోగ నిరోధకశక్తి తగ్గి అలసటకు గురై నీరసంగా మారతాయి.