News June 4, 2024
పొన్నూరులో ధూళిపాళ్ల లీడింగ్

AP: గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య వెనుకంజలో ఉన్నారు. పొన్నూరులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ముందంజలో ఉన్నారు.
Similar News
News January 18, 2026
విశాఖ జిల్లా ఆర్టీసీ ఆదాయం రూ.కోటి ఇరువై లక్షలు

సంక్రాంతి పండుగలు ముగించుకొని విశాఖ నుంచి తిరిగి వెళుతున్న ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ద్వారకా బస్సు కాంప్లెక్స్‌లో రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు ఆదివారం పర్యవేక్షణ చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్ సర్వీసుల సంఖ్య పెంచినట్టు ఆయన పేర్కొన్నారు. పండుగ నాలుగు రోజుల్లో విశాఖ జిల్లాకు ఆర్టీసీ ద్వారా రూ. కోటి ఇరువై లక్షలు ఆదాయం సమకూరినట్టు తెలిపారు.
News January 18, 2026
గర్భనిరోధక మాత్రలతో స్ట్రోక్ ముప్పు

అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టోజెన్ హార్మోన్లు కలిసి ఉన్న మాత్రలు వినియోగించే మహిళలకు క్రిప్టోజెనిక్ స్ట్రోక్ ముప్పు ఎక్కువని పరిశోధకులు గుర్తించారు. మెదడుకు రక్త ప్రవాహం జరిగే మార్గంలో రక్తం గడ్డకట్టడం వల్ల క్రిప్టోజెనిక్ స్ట్రోక్ వస్తుంది. మహిళలకు వస్తున్న స్ట్రోక్‌లలో దాదాపు 40% క్రిప్టోజెనిక్ ఐషెమిక్ స్ట్రోక్‌లేనని తెలిపారు.
News January 18, 2026
ఇతిహాసాలు క్విజ్ – 127 సమాధానం

ఈరోజు ప్రశ్న: మహాభారత యుద్ధంలో కౌరవుల వైపు ఉండి కూడా, పాండవుల విజయాన్ని కోరుకున్నది ఎవరు?
సమాధానం: కురుక్షేత్రంలో కౌరవుల సైన్యాధిపతిగా ఉన్న భీష్ముడు పాండవుల విజయాన్ని కోరుకున్నారు. ధర్మం పాండవుల వైపే ఉందని ఆయనకు తెలుసు. అందుకే, తనను ఎలా ఓడించాలో స్వయంగా పాండవులకే రహస్యాన్ని చెప్పి, వారు విజయం సాధించేలా సహకరించారు. ఆయనతో పాటు విదురుడు కూడా పాండవ పక్షపాతిగా ఉండేవారు.
<<-se>>#Ithihasaluquiz<<>>


