News June 4, 2024
విజయవాడలో కేశినేని నాని వెనుకంజ

విజయవాడ లోక్‌సభ సీటులో టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని 1200 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి, సోదరుడు కేశినేని నాని(వైసీపీ) వెనుకంజలో ఉన్నారు. తిరువూరు అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ ముందంజలో ఉన్నారు. మైలవరంలో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ లీడ్‌లో ఉన్నారు.
Similar News
News January 13, 2026
పిండివంటల కోసం ఈ చిట్కాలు

* పిండి వంటలు చేసేటపుడు నూనె పొంగకుండా ఉండాలంటే మరుగుతున్న నూనెలో తమలపాకు వేసి, అది రంగు మారాక తీస్తే సమస్య ఉండదు.
* వంటకాలు తక్కువ నూనెను పీల్చుకోవాలంటే మూకుడులో కాస్త వెనిగర్ వేయండి.
* వంటగది గట్టు మీద జిడ్డు పోవాలంటే కాస్త వంటసోడా చల్లి పీచుతో రుద్ది కడిగితే శుభ్రపడుతుంది.
*వంట నూనె నిల్వ ఉంచిన డబ్బాలో రెండు లవంగాలు వేస్తే మంచి వాసన వస్తుంది.
News January 13, 2026
కోడి పందెం బరులు.. బౌన్సర్లు సిద్ధం!

AP: సంక్రాంతి కోడి పందేలకు ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బరులు సిద్ధమయ్యాయి. షామియానాలు, సెక్యూరిటీ, బౌన్సర్లు, జనరేటర్లు, పార్కింగ్ స్థలాలు, తదితరాలకు నిర్వాహకులు రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు అతిథుల కోసం బుక్ చేస్తున్న రూముల కోసం 3 రోజులకు గానూ రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లిస్తున్నారు. ముఖ్యంగా భీమవరం ఏరియాలో రూముల కోసం భారీగా డిమాండ్ ఏర్పడినట్లు సమాచారం.
News January 13, 2026
భోగి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి?

భోగి 13న, 14న అనే సందిగ్ధత నెలకొంది. అయితే హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది భోగి పండుగను జనవరి 14వ తేదీన జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజే భోగిగా భావిస్తారు. అదే రోజు తెల్లవారుజామున భోగి మంటలు వేయడం శుభంగా చెబుతున్నారు. దీంతోనే సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. తర్వాతి రోజు సంక్రాంతి కాగా జనవరి 16న కనుమ పండుగ ఉంటుంది.


