News June 4, 2024

విజయనగరం ఎంపీ స్థానంలో టీడీపీ ముందంజ

image

AP: విజయనగరం ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ వైసీపీ తరఫున బెల్లాన చంద్రశేఖర్ బరిలో నిలిచారు. అటు బొబ్బిలిలో కూడా టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

Similar News

News November 3, 2025

WCలో సత్తా చాటిన తెలుగమ్మాయి శ్రీ చరణి

image

భారత మహిళల జట్టు <<18182320>>వన్డే వరల్డ్<<>> కప్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో కడపకు చెందిన శ్రీ చరణి అద్భుత ప్రదర్శనతో టీమ్ ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించారు. మొత్తం 9 మ్యాచుల్లో 14 వికెట్లు తీసి అత్యధిక వికెట్స్ తీసిన నాలుగో బౌలర్‌గా నిలిచారు. తొలిస్థానంలో ఉన్న దీప్తీ శర్మ(22) తర్వాత ఇండియా నుంచి శ్రీ చరణి మాత్రమే టాప్ 10లో చోటు దక్కించుకోవడం విశేషం.

News November 3, 2025

కంకరలో కూరుకుపోయి ఊపిరి ఆగి..

image

TG: రంగారెడ్డి జిల్లాలో జరిగిన <<18183371>>బస్సు ప్రమాదంలో<<>> మృతుల సంఖ్య భారీగా ఉండడానికి కంకరే కారణమని తెలుస్తోంది. మితిమీరిన వేగంతో టిప్పర్ బస్సుపైకి దూసుకొచ్చింది. దీంతో అందులోని కంకర మొత్తం బస్సులో కుడివైపు కూర్చున్న ప్రయాణికులపై పడింది. అందులో కూరుకుపోవడంతో ఊపిరి తీసుకోలేక చాలా మంది ప్రాణాలు వదిలినట్లు సమాచారం. బస్సులో ఎక్కువ మంది ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారు. ఇప్పటివరకు 21 మంది చనిపోయారు.

News November 3, 2025

కొన్ని క్యాచులు ట్రోఫీలను గెలిపిస్తాయి!

image

క్రికెట్‌లో క్యాచులు మ్యాచులనే కాదు.. <<18182320>>వరల్డ్ కప్‌<<>>లను కూడా గెలిపిస్తాయి. 1983WC ఫైనల్లో కపిల్ దేవ్ వివ్ రిచర్డ్స్(WI) క్యాచ్‌ పట్టి తొలి ట్రోఫీని అందించారు. 2024-T20WC ఫైనల్లో డేవిడ్ మిల్లర్(SA) ఇచ్చిన క్యాచ్‌ను సూర్యకుమార్ చాకచక్యంగా అందుకోవడంతో కప్ సొంతమైంది. తాజా WWCలో SA కెప్టెన్ లారాను అమన్‌జ్యోత్ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపడంతో భారత్‌కు అపూర్వ విజయం దక్కింది.