News June 4, 2024
BIG BREAKING: మ్యాజిక్ ఫిగర్ దాటిన కూటమి

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో NDA భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ 81 స్థానాల్లో, జనసేన 15, బీజేపీ 5 స్థానాల్లో, వైసీపీ 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అటు ఎంపీ స్థానాల్లో టీడీపీ 11, జనసేన 1, బీజేపీ 5, వైసీపీ 2 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.
Similar News
News December 30, 2025
సిద్దిపేట: ప్రాణం తీసిన బురద..!

మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న కూలీ బురద నీటిలో పడి, ఊపిరాడక మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్ఐ కీర్తిరాజు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన జోగు ప్రభాకర్(45) గ్రామంలో కూలి పని చేస్తూ, భార్య, ఇద్దరు పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు. పొలంలో ఒడ్డు చెక్కేందుకు పనికి వెళ్లి.. పనిచేస్తూ, మూర్ఛ రావడంతో బురదలో బోర్లా పడి మరణించాడు.
News December 30, 2025
వాస్తు రహస్యం: ఇంటి బ్రహ్మస్థానం ప్రాముఖ్యత

ఇంటికి మధ్యభాగమైన బ్రహ్మస్థానంలో ఏ బరువు ఉండకూడదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘ఇది ఇంటికి నాభి వంటిది. ఇక్కడి నుంచే సానుకూల శక్తి నలువైపులా ప్రసరిస్తుంది. ఈ భాగం ఖాళీగా, శుభ్రంగా, వెలుతురుతో ఉండాలి. గోడలు, స్తంభాలు, బరువులు ఉంచకూడదు. ఒకప్పుడు ఇక్కడ ఆకాశం కనిపించేలా ముంగిలి వదిలేవారు. ఈ స్థానాన్ని పవిత్రంగా ఉంచితే ఇంట్లో ఆరోగ్యం, అభివృద్ధి, ప్రశాంతత లభిస్తాయి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 30, 2025
డైలీ 4వేల అడుగులు వేస్తే మరణ ముప్పు తగ్గినట్లే: అధ్యయనం

యువకుల్లా వృద్ధులూ రోజూ 10 వేల అడుగులు నడవాల్సిన అవసరం లేదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. 72 ఏళ్ల వృద్ధ మహిళలపై 11 ఏళ్ల పాటు జరిపిన పరిశోధనలో.. వారానికి కేవలం 1-2 రోజులు 4,000 అడుగులు నడిచినా గుండె జబ్బులు, మరణాల ముప్పు గణనీయంగా తగ్గుతుందని తేలింది. మెట్లు ఎక్కడం, భోజనం తర్వాత నడక వంటి చిన్న చిన్న మార్పులతో ఈ లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. SHARE IT


