News June 4, 2024
UP: స్మృతి, రాజ్‌నాథ్ వెనుకంజ

ఉత్తర్ ప్రదేశ్‌లో పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. బీజేపీ అనూహ్యంగా వెనకబడింది. మొత్తం 80 స్థానాల్లో కేవలం 37లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. విపక్ష ఇండియా కూటమి ఏకంగా 41 స్థానాల్లో దూసుకుపోతోంది. అమేథీలో స్మృతి ఇరానీపై కిశోరీలాల్ ఆధిక్యం కనబరుస్తున్నారు. రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ దూసుకెళ్తున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం వెనుకంజలో ఉన్నారు.
Similar News
News January 13, 2026
‘విజయనగరం జిల్లాలో యూరియా కొరత లేదు’

రబీ 2025–26 పంట కాలానికి విజయనగరం జిల్లాలో అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ శాఖ సోమవారం తెలిపింది. ఇప్పటివరకు 12,606 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా కాగా.. ప్రస్తుతం 2,914 మెట్రిక్ టన్నుల నిల్వ ఉందని పేర్కొంది. అదనంగా 800 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరనుంది. రైతులు సిఫార్సు చేసిన మోతాదులోనే యూరియాను వినియోగించాలని అధికారులు సూచించారు.
News January 13, 2026
ఒకటి, రెండు రోజుల్లో షెడ్యూల్!

TG: రాష్ట్రంలో పండగ వేళ ఎన్నికల సందడి మొదలుకానుంది. మున్సిపల్ ఓటర్ల ఫైనల్ లిస్ట్ విడుదల చేయడంతో షెడ్యూల్ రిలీజ్‌కు SEC సిద్ధమైంది. 1,2 రోజుల్లో షెడ్యూల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. FEB రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ నెల 20 నాటికి రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం SC, ST, డెడికేషన్ కమిషన్ ఆధారంగా BC రిజర్వేషన్లను ప్రకటించనుంది.
News January 13, 2026
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే..!

ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల సాధ్యమైనంత మేరకు <<18842236>>డయాబెటిస్<<>>ను దూరం పెట్టొచ్చని వైద్యులు చెబుతున్నారు. ‘చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు తగ్గించి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాలి. వ్యాయామం చేయడం, ధూమపానం మానేయడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి చాలా ముఖ్యం’ అని సూచిస్తున్నారు. మరోవైపు మీ శరీర బరువు అదుపులో ఉంచుకుంటే మధుమేహం వచ్చే అవకాశం 60% వరకు తగ్గుతుందని చెబుతున్నారు.


