News June 4, 2024

పెనమలూరులో వైసీపీ అభ్యర్థి జోగి రమేశ్ ముందంజ

image

AP: పెనమలూరులో మంత్రి జోగి రమేశ్ లీడింగ్‌లో ఉన్నారు. తన ప్రత్యర్థి బోడె ప్రసాద్‌పై 275 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇటు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు(SC)లో టీడీపీ అభ్యర్థి బూర్ల రామంజనేయులు 2,758 ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు.

Similar News

News January 13, 2026

డయాబెటిస్ రాకుండా ఉండాలంటే..!

image

ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల సాధ్యమైనంత మేరకు <<18842236>>డయాబెటిస్‌<<>>ను దూరం పెట్టొచ్చని వైద్యులు చెబుతున్నారు. ‘చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు తగ్గించి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాలి. వ్యాయామం చేయడం, ధూమపానం మానేయడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి చాలా ముఖ్యం’ అని సూచిస్తున్నారు. మరోవైపు మీ శరీర బరువు అదుపులో ఉంచుకుంటే మధుమేహం వచ్చే అవకాశం 60% వరకు తగ్గుతుందని చెబుతున్నారు.

News January 13, 2026

చర్మం పొడిబారి రాలుతోందా?

image

శీతాకాలం మొదలైతే చాలు చర్మం పొడిబారడం, ఎండిపోయి జీవం కోల్పోయినట్టుగా ఉండటం చాలామందిలో కనిపించే సమస్య. చర్మం బాగా పగిలిపోతే కలబంద రాయాలి. ఇది చర్మానికి చల్లదనం ఇవ్వడమే కాదు.. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు దురద, నొప్పిని తగ్గిస్తాయి. ఆలివ్‌ నూనె సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. కొబ్బరి, జొజోబా నూనెలను సమపాళ్లలో తీసుకొని దానికి కొన్నిచుక్కల టీట్రీ ఆయిల్‌ కలిపి చర్మానికి రాయాలి.

News January 13, 2026

‘జిగురు అట్టల’తో రసంపీల్చే పురుగుల ఆటకట్టు

image

పంటలకు హానిచేసే రసం పీల్చే పురుగుల కట్టడిలో జిగురు అట్టలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ అట్టల ఉపరితలంపై జిగురు ఉంటుంది. వాటిపై వాలే పురుగులు జిగురుకు అంటుకుపోయి మరణిస్తాయి. పసుపు రంగు జిగురు అట్టలు తెల్లదోమ, పచ్చదోమ, వివిధ రకాల ఈగలను.. తెలుపు అట్టలు నల్ల తామర, ఎర్ర నల్లి, బ్లాక్‌ త్రిప్స్‌.. నీలిరంగు అట్టలు తామర పురుగులు, పేనుబంక, మిడతలను ఆకర్షిస్తాయి. ఈ అట్టలపై వాలగానే ఆ పురుగులు అతుక్కుని చనిపోతాయి.