News June 4, 2024
కడప మినహా అన్ని జిల్లాల్లో కూటమే..
ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల్లో కూటమి దూసుకెళ్తోంది. ఒక్క కడప మినహా అన్ని జిల్లాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అధిక్యంలో కొనసాగుతున్నాయి. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనూ కూటమి గట్టి పోటీ ఇస్తోంది. టీడీపీ బలహీనంగా ఉన్న రాయలసీమ, దక్షిణ కోస్తాలోనూ సైకిల్ దూసుకెళ్తోంది.
Similar News
News January 23, 2025
తెలంగాణలో JSW రూ.800 కోట్ల పెట్టుబడులు
TGలో రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు JSW సంస్థ దావోస్‌లో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. USకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఏర్పాటయ్యే ఈ యూనిట్ ద్వారా 200 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయి. రక్షణ రంగంలో అత్యాధునిక టెక్నాలజీతో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు.
News January 23, 2025
కాలేజీలు బంద్ చేస్తామని హెచ్చరిక
TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని తెలంగాణ యూనివర్సిటీ వీసీకి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు విజ్ఞప్తి చేశాయి. బకాయిలు విడుదల కాకపోతే కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించాయి. ఏడాది నుంచి సిబ్బంది జీతభత్యాలు, భవనాల అద్దెలు కూడా చెల్లించలేకపోతున్నామని యాజమాన్యాలు విన్నవించాయి. ప్రభుత్వం జాప్యం చేయకుండా ఫీజు బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలని కోరాయి.
News January 23, 2025
నూతన DGP ఈయనేనా?
AP: DGP ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ సమయం దగ్గర పడటంతో కొత్త DGP ఎవరనే చర్చ జరుగుతోంది. నూతన DGPగా హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ DGగా ఉన్నారు. ఎన్నికలప్పుడు హరీశ్‌ను ఎన్నికల సంఘం DGPగా నియమించిన విషయం తెలిసిందే. పదవీకాలం పొడిగింపు కోసం తిరుమలరావు, పోలీస్ బాస్ పోస్ట్ కోసం CID DG రవిశంకర్ పోటీలో ఉన్నట్లు సమాచారం.