News June 4, 2024

ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌కు దూరంగా ఎర్లీ ట్రెండ్స్‌

image

ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ దేశ వ్యాప్తంగా ఎర్లీ ట్రెండ్స్‌లో ఎన్డీయే – ఇండియా కూట‌ముల మ‌ధ్య హోరాహోరి పోరు జ‌రుగుతోంది. ఎన్డీయే 285 స్థానాల్లో, ఇండియా కూట‌మి 221 స్థానాల్లో త‌మ ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఎర్లీ ట్రెండ్స్ ఉండ‌డంతో ఆస‌క్తి నెల‌కొంది. యూపీలో ఎన్డీయే 37 స్థానాల్లో, ఇండియా కూట‌మి 39 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నాయి.

Similar News

News October 8, 2024

కాంగ్రెస్ ఎన్నికల ఖర్చు రూ.585 కోట్లు

image

ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల(ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం) అసెంబ్లీ ఎన్నికలకు రూ.585 కోట్లు ఖర్చు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఈసీకి వివరాలను సమర్పించింది. యాడ్స్, మీడియా ప్రచారానికి రూ.410 కోట్లు, ఇతరత్రాలకు మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేసినట్లు తెలిపింది. కాగా కాంగ్రెస్ వద్ద డిపాజిట్ల రూపంలో రూ.170 కోట్లు ఉండగా వివిధ మార్గాల్లో రూ.539.37 కోట్లు వచ్చాయని పేర్కొంది.

News October 8, 2024

జగన్‌కు బీజేపీ ఎమ్మెల్యే సవాల్

image

AP: వైసీపీ చీఫ్ జగన్‌కు దమ్ముంటే తనపై జమ్మలమడుగులో పోటీ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు. స్థానిక వైసీపీ నేతలు తనకు సరితూగరని చెప్పారు. రామసుబ్బారెడ్డి, సుధీర్ రెడ్డి ఇష్టారీతిగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సంక్రాంతి నాటికి రాజోలి జలాశయ నిర్మాణం, టిడ్కో ఇళ్ల పంపిణీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేరుస్తుందన్నారు.

News October 8, 2024

సచిన్ తొలి సెంచరీ ఎక్కడ చేశారంటే?

image

తాను అధికారికంగా మొదటి సెంచరీ బరోడాలో చేసినట్లు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చెప్పారు. ఈ విషయం చాలా మందికి తెలియదన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన సందర్భంగా ఆయన మాట్లాడారు. 1986లో తొలి సెంచరీ అండర్-15 టోర్నమెంట్‌లో మహారాష్ట్ర తరఫున చేసినట్లు పేర్కొన్నారు. తన 400వ వన్డే మ్యాచ్ కూడా బరోడాలోనే ఆడినట్లు ఈ క్రీడా దిగ్గజం గుర్తు చేసుకున్నారు.