News June 4, 2024
1.50 లక్షల ఓట్ల మెజార్టీలో శివరాజ్ సింగ్

ఎంపీగా పోటీ చేసిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విదిశాలో తన సమీప ప్రత్యర్థి ప్రతాప్ భాను శర్మ(కాంగ్రెస్)పై ఆయన 1,50,870 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. ఈసారి కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే శివరాజ్‌కు కేంద్రమంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.
Similar News
News September 13, 2025
కాసేపట్లో వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో సాయంత్రం 4 గంటలలోపు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మెదక్, నల్గొండ, సిద్దిపేటలో వాన పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. హైదరాబాద్, ఆదిలాబాద్, హన్మకొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూల్, సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి వానలు పడొచ్చని పేర్కొంది.
News September 13, 2025
నిరుద్యోగులను మోసం చేసిన సీఎం: హరీశ్‌రావు

TG: గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని BRS నేత హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ‘జాబ్స్ కోసం మంత్రులు, అధికారులు లంచం అడిగారని నిరుద్యోగులు చెబుతున్నారు. తప్పును సరిదిద్దుకోకుండా మరోసారి అప్పీల్‌కి వెళ్లాలనుకోవడం సిగ్గుచేటు. 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామని రాహుల్, ప్రియాంకతో చెప్పించి రేవంత్ మోసం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం’ అని స్పష్టం చేశారు.
News September 13, 2025
మోదీ మణిపుర్ పర్యటనపై కాంగ్రెస్ విమర్శలు

ఘర్షణలు జరిగిన రెండేళ్ల తర్వాత PM మోదీ మణిపుర్ <<17696611>>పర్యటన<<>>కు వెళ్లడం అక్కడి ప్రజలను అవమానించడమేనని INC మండిపడింది. ‘864 రోజుల ఘర్షణలో 300 మంది చనిపోయారు. 1500 మంది గాయపడ్డారు. 67వేల మంది నిర్వాసితులయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు PM 46 విదేశీ పర్యటనలు చేశారు కానీ ఒక్కసారి కూడా మణిపుర్‌లో పర్యటించలేదు’ అని ఖర్గే విమర్శించారు. రెండేళ్ల తర్వాత మోదీ మణిపుర్ వెళ్లడం దురదృష్టకరమని ప్రియాంకా గాంధీ అన్నారు.