News June 4, 2024

మచిలీపట్నంలో వైసీపీ వెనుకంజ

image

AP: కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు, వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి వెనుకంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర 6,691 ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. ఇటు కైకలూరులో బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ లీడింగ్‌లో ఉన్నారు.

Similar News

News October 7, 2024

వారికి రూ.5,00,000 ఆర్థిక సాయం

image

గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయంపై తెలంగాణ ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. DEC 7, 2023 తర్వాత బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఒమన్, ఖతర్, సౌదీ, UAEల్లో ఎలాంటి కారణంతోనైనా చనిపోతే రూ.5 లక్షల పరిహారం ఇవ్వనుంది. చనిపోయిన 6 నెలల్లోపు డెత్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్, వర్క్ వీసా, ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్, బ్యాంక్ వివరాలతో కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

News October 7, 2024

ఝార్ఖండ్ ఎన్నికలపై బీజేపీ అధిష్ఠానం కసరత్తు

image

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. అభ్యర్థుల ఎంపికపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన సోమవారం కీలక నేతల సమావేశం జరిగింది. 28 గిరిజన స్థానాల్లో మిత్రపక్షాలు కాకుండా సొంతంగా బరిలోకి దిగాలని యోచిస్తోంది. మాజీ సీఎం చంపై సోరెన్ ద్వారా ఆ వర్గాలు BJPకి చేరువయ్యేలా వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. మిత్రపక్షాలు AJSUకు 9, JDUకు 2 స్థానాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

News October 7, 2024

అడ్రస్ మార్చినా 48ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన లేఖ

image

ఉద్యోగం కోసం 1976లో దరఖాస్తు చేసిన లేఖ 48 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన ఘటన UKలోని లింకన్‌షైర్‌లో జరిగింది. టిజీ హాడ్సన్ అనే 70 ఏళ్ల మహిళకు బైక్ స్టంట్ రైడర్‌ కావాలనే కల ఉండేది. దీంతో ఉద్యోగం కోసం ఆమె దరఖాస్తు చేసి ఆ లేఖను పోస్ట్ చేయగా అది పోస్టాఫీసులోని కబోర్డులో ఇరుక్కుపోయింది. తాజాగా ఆ లేఖను గుర్తించిన అధికారులు తిరిగి పంపారు. అయితే, అడ్రస్ మార్చినా లెటర్ ఎలా వచ్చిందో తెలియట్లేదని ఆమె తెలిపారు.