News June 4, 2024
BRS టు కాంగ్రెస్, BJP

2019 BRS 9పార్లమెంట్ స్థానాల్లో గెలిచింది. అందులో మెదక్ మినహా మిగతా స్థానాల్లో కాంగ్రెస్, BJP ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్‌కు వరంగల్, జహీరాబాద్, మహబూబాబాద్, ఖమ్మం, నాగర్ కర్నూల్, పెద్దపల్లి. BJPకి చేవెళ్ల, మహబూబ్‌నగర్ ఆధిక్యంలో ఉన్నాయి.
Similar News
News November 5, 2025
వరిని ఆరబెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వరి పంట కోసిన తర్వాత పనల మీద గింజలు కొంత వరకు ఎండుతాయి. తూర్పారబట్టి శుభ్రపరచిన ధాన్యాన్ని ఆరబెట్టి తేమను 12-14%కు తగ్గించాలి. అయితే ధాన్యంలో తేమ ఒక్కసారిగా తగ్గకూడదు. క్రమక్రమంగా తగ్గాలి. దీని కోసం సాధారణమైన ఎండలో ధాన్యాన్ని పరిచి మధ్యమధ్యలో తిరగతిప్పాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆరబెడితే గింజల్లో తేమ ఒక్కసారిగా తగ్గి గింజలపై పగుళ్లు వచ్చి.. ధాన్యం మిల్లింగ్ సమయంలో నూకలయ్యే అవకాశం ఎక్కువ.
News November 5, 2025
మిడ్ డే మీల్.. రేట్లు పెంపు

TG: స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి అందించే ధరలను పెంచుతూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి ఇచ్చే రూ.5.45ను రూ.6.19కి, ప్రాథమికోన్నత స్కూళ్లలో రూ.8.17 నుంచి రూ.9.29కి పెంచారు. 9,10వ తరగతుల విద్యార్థులకు రూ.10.67 నుంచి రూ.11.79కి పెంచారు. కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో పీఎం పోషణ్ పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే.
News November 5, 2025
ఈ సరసమైన రీఛార్జ్ ప్యాక్స్ అవసరం.. AIRTEL, JIOలకు విజ్ఞప్తులు!

అతితక్కువ మొబైల్ డేటాను వాడే సీనియర్ సిటిజన్లు, WiFi యూజర్లను దృష్టిలో ఉంచుకుని రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టాలని AIRTEL, JIOలకు నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ‘ప్రతి నెలా ₹100 కంటే తక్కువ ధరకు వాయిస్ ఓన్లీ ప్లాన్‌లను అందించండి. అవసరం లేకపోయినా, ప్రజలు డేటాను తీసుకోవలసి వస్తుంది. డైలీ 1GB & వాయిస్ కాల్స్ ఇచ్చే నెల, వార్షిక ప్లాన్స్ ఇవ్వండి. BSNLలో సరసమైన ప్లాన్స్ ఉన్నాయి’ అని సూచిస్తున్నారు.


