News June 4, 2024

సర్వేపల్లిలో సోమిరెడ్డి ఆధిక్యం

image

AP: సర్వేపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్దన్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. అలాగే మార్కాపురంలో టీడీపీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి 1029 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి అన్నా రాంబాబు వెనకంజలో ఉన్నారు. సంతనూతలపాడులో విజయ్ కుమార్ 7940 ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు.

Similar News

News January 29, 2026

BRS యాక్షన్‌ను బట్టి నా రియాక్షన్ ఉంటుంది: దానం

image

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణల వేళ స్పీకర్ నోటీసులిచ్చిన నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ‘విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని చెప్పలేదు. స్పీకర్ నోటీసులకు మా అడ్వకేట్ వివరణ లేఖ రాశారు. అందులో ఏం రాశారో నాకు తెలియదు. స్పీకర్ నుంచి మళ్లీ జవాబు రాలేదు. BRS నన్ను సస్పెండ్ చేయలేదు. ఆ పార్టీ యాక్షన్‌‌ను బట్టి నా రియాక్షన్ ఉంటుంది. ఎన్నికలకు నేను భయపడను’ అని ఆయన స్పష్టం చేశారు.

News January 29, 2026

యాదాద్రిలో బంగారు, వెండి డాలర్లు మాయం

image

TG: యాదగిరిగుట్టలో బంగారం, వెండి డాలర్ల మాయం అంశం కలకలం రేపుతోంది. ప్రచార శాఖలో రూ.10 లక్షల మేర విలువైన కాయిన్స్ మాయమైనట్లు ఆడిట్‌లో వెల్లడైంది. ఇటీవలే ప్రసాదాల తయారీలో చింతపండు చోరీ కలకలం రేపడం తెలిసిందే.

News January 29, 2026

జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్!

image

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ తెరకెక్కించిన ‘విశ్వంభర’ సినిమా విడుదలపై ఓ క్లారిటీ వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్ లేదా జులై నెలలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు రీసెంట్ మీడియా ఇంటరాక్షన్‌లో చిరంజీవి చెప్పినట్లు సినీవర్గాలు తెలిపాయి. అందులోనూ జులై 10న రావొచ్చని డేట్ కూడా చెప్పేశారట. భారీ ఫాంటసీ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రానికి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.