News June 4, 2024
హైదరాబాద్‌లోనూ గెలుస్తున్నాం: మాధవీలత

హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి మాధవీ లత ధీమా వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ 400లకు పైగా సీట్లు సాధిస్తుందని ఆమె అన్నారు. గత పదేళ్లలో మోదీ అద్భుతంగా పని చేశారని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఆ స్థానంలో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Similar News
News November 6, 2025
పసుపులో ముర్రాకు తెగులు, దుంపకుళ్లు.. నివారణకు సూచనలు

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పసుపు పంటలో ముర్రాకు తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్ని రోజుల్లోనే పొలమంతా విస్తరిస్తుంది. అందుకే తెగులు ఆశించిన ఆకులను తుంచి కాల్చివేయాలి. థయోఫానైట్ మిథైల్ 2 గ్రా. లేదా ప్రొపికొనజోల్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి ఆకులు బాగా తడిచేలా పిచికారీ చేయాలి. అలాగే దుంపకుళ్లు నివారణకు లీటరు నీటికి మెటలాక్సిల్+మ్యాంకోజెబ్ 3గ్రా. చొప్పున కలిపి మొక్కల మొదళ్లను తడపాలి.
News November 6, 2025
డిజిలాకర్‌లో సర్టిఫికెట్లు, హెల్త్ రికార్డులు: సీఎం

AP: డేటా ఆధారిత పాలన ఎంతో కీలకమని CM చంద్రబాబు తెలిపారు. తుఫాను సమయంలో టెక్నాలజీ సాయంతో ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించామన్నారు. పాలనలో ఆధునిక టెక్నాలజీ, RTGSతో సమన్వయంపై అధికారులు, మంత్రులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ‘అందుబాటులో ఉన్న డేటాను రియల్‌టైమ్‌లో ప్రాసెస్ చేస్తున్నాం. దీన్ని విస్తరించాలి. డిజిలాకర్‌లో విద్యార్థుల సర్టిఫికెట్లు, రోగుల హెల్త్ రికార్డులు అందుబాటులో ఉండాలి’ అని సూచించారు.
News November 6, 2025
మంత్రి ఆమోదం కోసం మైక్రో బ్రూవరీల ఎదురుచూపు

TG: HYD కోర్ అర్బన్, ఇతర 6 కార్పొరేషన్లలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ ఇంతకు ముందు టెండర్లు పిలిచింది. SEP 25 గడువు నాటికి ఎక్సైజ్ శాఖకు 127 మంది బిడ్లు దాఖలు చేశారు. ఆ వివరాలు తనకు పంపాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించడంతో అధికారులు ఆయనకు సమర్పించారు. టెండర్లు ఖరారు చేయడానికి మంత్రి ఆమోదం కోసం అప్పటినుంచి ఎదురుచూస్తున్నారు. మంత్రి ఓకే అనేవరకు టెండర్ల ఖరారులో జాప్యం తప్పేలా లేదు.


