News June 4, 2024
నార్త్‌లో అలా.. సౌత్‌లో ఇలా

నార్త్ ఇండియాలో ఓటర్లు NDAకు షాక్ ఇస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో BJP కూటమికి ఊహించిన స్థాయిలో సీట్లు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఓటర్లు ఇండియా కూటమి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు సౌత్ ఇండియాలో (ముఖ్యంగా AP, TGలో) NDAకు ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. దీంతో నార్త్‌లో NDA ఓట్లు ఇండియా కూటమికి, సౌత్‌లో ఇండియా కూటమి ఓట్లు NDAకు మారినట్లు తెలుస్తోంది.
Similar News
News September 12, 2025
CPL: చివరి బంతికి గెలిపించిన హోల్డర్

CPLలో సెయింట్ కిట్స్&నెవిస్ పాట్రియాట్స్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు. ఇన్నింగ్స్ చివరి బంతికి వికెట్ తీసి తన జట్టుకు విజయం కట్టబెట్టారు. తొలుత సెయింట్స్ కిట్స్ 20 ఓవర్లలో 150/7 పరుగులు చేసింది. హోల్డర్ 30 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 53 పరుగులు బాదారు. ఛేదనలో బార్బడోస్ రాయల్స్ 149/7కే పరిమితమైంది. చివరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉండగా డానియల్ సామ్స్‌ను హోల్డర్ ఔట్ చేశారు.
News September 12, 2025
OTTలోకి వచ్చేసిన అనుపమ ‘పరదా’

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పరదా’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా తెలుగు, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాగ్ మయూర్, గౌతమ్ మేనన్, సంగీత, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. ఆగస్టు 22న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది.
News September 12, 2025
శ్రీవారి దర్శనానికి 24గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 24గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వరస్వామిని 66,312 మంది దర్శించుకోగా.. 27,728 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.81కోట్లు వచ్చినట్లు TTD వెల్లడించింది. మరోవైపు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శ్రీవారిని దర్శించుకున్నారు.