News June 4, 2024

కనిగిరి, వై.పాలెంలో నువ్వా-నేనా?

image

AP: కనిగిరిలో టీడీపీ-వైసీపీ మధ్య ఆధిక్యం దోబూచులాడుతోంది. ఓ రౌండ్‌లో టీడీపీకి.. మరో రౌండ్‌లో వైసీపీకి లీడ్ వస్తోంది. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ 590 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. యర్రగొండపాలెంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ కూడా ఆధిక్యం మారుతూ వస్తోంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ 441 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Similar News

News January 3, 2025

TODAY HEADLINES

image

* వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’
* తెలంగాణలో సాగు చేసే అందరికీ రైతుభరోసా!
* గోవాలో ఏపీ యువకుడి దారుణ హత్య
* ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు
* JAN 3న తెలంగాణ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం
* ‘తొలి ప్రేమ’ రెమ్యునరేషన్‌తో బుక్స్ కొన్నా: పవన్ కళ్యాణ్
* పెళ్లి చేసుకున్న సింగర్ అర్మాన్ మాలిక్
* ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కు గెస్ట్‌గా పవన్ కళ్యాణ్
* మనూ భాకర్, గుకేశ్‌లకు ఖేల్ రత్న

News January 3, 2025

ఈసారి చలి వల్ల ఢిల్లీలో పాఠశాలలకు సెలవులు

image

ఢిల్లీలో మొన్న‌టిదాకా కాలుష్యం వ‌ల్ల మూత‌బ‌డిన స్కూళ్లు, ఇప్పుడు కోల్డ్ వేవ్స్ వ‌ల్ల మూత‌బ‌డ్డాయి. శీతాకాలం వ‌ల్ల ప‌డిపోతున్న ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు, చ‌లి తీవ్ర‌త కార‌ణంగా NCR ప‌రిధిలోని గౌత‌మ్‌బుద్ధ‌ న‌గ‌ర్‌లో 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు సెల‌వు ప్ర‌క‌టించారు. త‌దుప‌రి ఉత్తర్వుల వ‌ర‌కు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి. మ‌ధ్య భార‌తంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ Janలో గ‌తం కంటే అధికంగా చ‌లి తీవ్రత ఉంటుంద‌ని IMD తెలిపింది.

News January 3, 2025

సిడ్నీ టెస్టులో రిషభ్ పంత్‌ కీలకం?

image

సిడ్నీ మైదానంలో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్‌ రిషభ్ పంత్‌కు అద్భుత రికార్డ్ ఉంది. ఇక్కడ ఆయన మూడు ఇన్నింగ్స్‌లు ఆడగా 159*, 36, 97 పరుగులు చేశారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన అండగా నిలిచారు. మరోసారి భారత జట్టుకు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సిరీస్‌ను 2-2తో సమం చేయాలంటే పంత్ రాణించాలని ఆశిస్తున్నారు. కాగా ఈ వేదికపై భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది.